- హిందూకుష్ పర్వత ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం
- 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు
- ఢిల్లీ, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లో ప్రకంపనలు
దేశ రాజధాని ఢిల్లీ… చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భూప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో మధ్యాహ్నం 2.40 గంటలకు భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాదిన పలుచోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది.