అంతర్జాతీయం

 ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీ సహా ఉత్తరాదిన ప్రకంపనలు

  • హిందూకుష్ పర్వత ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం
  • 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు
  • ఢిల్లీ, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లో ప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీ… చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భూప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో మధ్యాహ్నం 2.40 గంటలకు భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాదిన పలుచోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది.

Related posts

అమెరికన్లను వేధిస్తున్న అసలు సమస్యలు ఇవే.. సర్వేలో కీలక విషయాల వెల్లడి!

Ram Narayana

ఇరాన్ గగనతలం మూసివేత .. 16 ఎయిరిండియా విమానాల దారి మళ్లింపు

Ram Narayana

డెలివరీ బాయ్ వేషంలో వచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్‌ కాల్చివేత!

Ram Narayana