ఈ ఫొటోలకు క్యాప్షన్ అక్కర్లేదు.. అటల్ సేతు ఫొటోలతో ఆనంద్ మహీంద్ర ట్వీట్l
ప్రారంభోత్సవానికి సిద్ధమైన అటల్ సేతు బ్రిడ్జి
దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డు
శుక్రవారం ప్రారంభించనున్న ప్రధాని మోదీ
బైక్ లు, ఆటోలకు నో ఎంట్రీ, గరిష్ఠంగా 100 కి.మీ. స్పీడ్
ముంబై సముద్ర తీరాన అందమైన అద్భు తం కనిపించబోతుంది … ముంబైలోని సౌత్ ముంబై నుంచి నావి ముంబై వరకు 21.8 కి.మీ దూరం నిర్మించిన అటల్ సేతు వారధి దేశంలోనే అత్యంత పొడవైనది … సముద్రంపై ముంబైకి అనుకోని పై భాగంలో నిర్మించిన ఈవారది అద్భుతమైన ఆకర్షణగా నిలిచింది… 18 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన చూపరులను ఆకర్షిస్తుంది … సముద్రం పైనే 16.5 కిలోమీటర్ లు నిర్మించడం భూమి మీద 5 .3 కిలోమీటర్లు నిర్మించారు.. ప్రారంభానికి సిద్ధమైన ఈ బ్రిడ్జ్ ఎలాంటి టూ వీలర్స్, ఆటోలకు అనుమతి లేదు… మిగతా వాహనాలు గరిష్టంగా 100 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది…నావి ముంబై నుంచి సౌత్ ముంబైకి వెళ్లాలంటే గతంలో రెండు గంటల సమయం పట్టేది … ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లో ని ఈ ప్రయాణాన్ని చేరుకునే అవకాశం కలుగుతుంది. సముద్రం పక్కనే నిర్మించడం ఒకఅందమైన అద్భుతాన్ని కలిగిస్తుంది … ఒక వింత ప్రపంచాన్ని చూసినట్లు అనిపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు …శుక్రవారం ఈ బ్రిడ్జి ని దేశ ప్రధాని మోడీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది …
దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డు నమోదు చేసుకున్న అటల్ సేతు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెట్టిన ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (హెచ్ టీఎంఎల్) ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ వేడుక కోసం బ్రిడ్జిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రిపూట విద్యుత్ దీపాల కాంతితో మిరుమిట్లు గొలుపుతున్న అటల్ సేతు ఫొటోలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పంచుకున్నారు. క్యాప్షన్ అక్కర్లేని, వర్ణించేందుకు పదాలు లేని ఫొటోలంటూ కామెంట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అటల్ సేతుపైకి ఆటోలకు, బైక్ లకు ఎంట్రీ లేదని ముంబై పోలీసులు వివరించారు. ఈ బ్రిడ్జిపై వాహనాల వేగాన్ని గరిష్ఠంగా 100 కిలోమీటర్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బ్రిడ్జి పైకి వెళ్లేందుకు, కిందికి దిగేందుకు ఏర్పాటు చేసిన మార్గాల వద్ద మాత్రం వాహనాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని సూచించారు. బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతో ఈ రూల్స్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
బ్రిడ్జి విశేషాలు..
- దక్షిణ ముంబైని నవీ ముంబైతో కలుపుతూ 21.8 కిలోమీటర్ల పొడువుతో నిర్మాణం
- ఈ మార్గంలో దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు
- గతంలో ఇదే దూరానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది
- ఆరు లేన్లతో సముద్రంపై 16.5 కి.మీ. నేలపై 5.3 కి.మీ. ఏర్పాటు
- 2018లో నిర్మాణ పనులు ప్రారంభం
- బ్రిడ్జి నిర్మాణానికి రూ.18 వేల కోట్ల ఖర్చు