తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎన్నికల్లో మనతో ఉన్నోడే మనోడు…అవకాశవాదులు పార్టీలో స్థానంలేదు…సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యకలాపాలు జనరంజకంగా నడిపేందుకు ప్రయత్నం చేస్తూనే మరో పక్క పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డారు …ఎన్నికల్లో పనిచేసినోడే మనోడు …అవకాశవాదులు పార్టీలో స్థానంలేదు వారిని శత్రులలాగానే చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు …అనేక మంది అధికారం వచ్చిందని పార్టీలోకి వచ్చి పైరవీలు చేసుకుందుకు రరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు …ఎదో రకంగా పార్టీకి ఎమ్మెల్యేలకు మంత్రులకు దగ్గరై వారి పనులు చక్కపెట్టుకోవాలని చేసున్నారు …దీంతో పార్టీ యంత్రాంగానికి సీఎం దిశా నిర్దేశం చేశారు …ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని పార్టీలో చేర్చుకోవద్దని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు…సీఎం రేవంత్ రెడ్డి

అధికారం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కార్యకర్తలే పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వారికీ పార్టీలో పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు …ఎవరు సొంత ఇమేజ్ తో ఎమ్మెల్యే కాలే… పార్టీ బలం, కార్యకర్తల శ్రమతో పార్టీ అధికారంలోకి వచ్చింది …ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాడే మనోడు చేయని ప్రతి ఒక్కడిని శత్రువుగా భావించాలి…ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలోకి చేర్చుకుంటే కార్యకర్తలు సహించరని గుర్తు పెట్టుకోవాలని అన్నారు …అధికారం లేకపోయినా పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలే మనకు శ్రీరామరక్ష…కార్యకర్తల మనసు నొప్పించకుండా పాలన సాగించాల్సి ఉందని అన్నారు….

Related posts

ఖమ్మం లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జనలు…

Ram Narayana

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది: రేవంత్ రెడ్డి

Ram Narayana

పార్టీలో ఇంకెంత కాలం ఈ అవమానాలు?: జీవన్ రెడ్డి ఆగ్రహం…

Ram Narayana