- నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
- ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడి
- బి.జనార్దన్ రెడ్డి, ఇతర సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ లోగా వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇటీవలి వరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఉన్న జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల క్రితం ఆమోదించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.