Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పెనమలూరులో చంద్రబాబు పోటీ చేసినా గెలుపు నాదే: జోగి రమేశ్

  • జగన్ ఏది చెపితే అది చేయడానికి తాను సిద్ధమన్న జోగి రమేశ్
  • విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలుస్తారని వ్యాఖ్య
  • విధిలేని పరిస్థితుల్లో జగన్ ను నాని తిట్టి ఉండొచ్చన్న రమేశ్

పెనమలూరు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని… చంద్రబాబు పోటీ చేసినా గెలుపు తనదేనని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. పెడనలో తన సిట్టింగ్ స్థానం నుంచి ఎవరు పోటీ చేసినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. తమ అధినేత జగన్ ఏది చెపితే అది చేయడానికి తాను సిద్ధమని అన్నారు. 2009లో పెడన నుంచి పోటీ చేశానని… 2014లో మైలవరం నుంచి తనను జగన్ పోటీ చేయించారని, కానీ అప్పుడు ఓడిపోయానని చెప్పారు. ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గానికి పంపుతున్నారని… అక్కడ కచ్చితంగా గెలుస్తానని అన్నారు. 

విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలవడం ఖాయమని జోగి రమేశ్ చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో జగన్ ను కేశినేని నాని తిట్టాల్సి ఉంటుందని అన్నారు. విధిలేని పరిస్థితుల్లో నాని అలా మాట్లాడి ఉండొచ్చని చెప్పారు. మరోవైపు, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి ఆ స్థానాన్ని జగన్ కేటాయించని సంగతి తెలిసిందే. దీంతో, ఆయన టీడీపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు.

Related posts

ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు

Ram Narayana

గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధగా ఉంది: బొత్స

Ram Narayana

గుంటూరు వైసీపీలో విభేదాలు.. ఎమ్మెల్యే, మేయర్ మధ్య వాగ్వాదం

Ram Narayana

Leave a Comment