Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఇటు నామ ….మరి అటు ఎవరు ….?

మరికొద్ది నెలల్లో పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్న తరణంలో ఖమ్మం లోకసభకు పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నాయి….అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీఆర్ యస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది …దీంతో సిట్టింగ్ ఎంపీ గా ఉన్న బీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ను తిరిగి బరిలోకి దింపనున్నారు…ఇందుకోసం ఈనెల 9 వ తేదీన హైద్రాబాద్ లోని తెలంగాణ భవనంలో కేటీఆర్ ఆధ్వరంలో జరిగిన జిల్లా ముఖ్యనేతల సమావేశంలో దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం …అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు 7 లక్షల 33 వేల 293 ఓట్లు రాగా, బీఆర్ యస్ కు 4 లక్షల 83 వేల 893 వేల ఓట్లు వచ్చాయి…అంటే కాంగ్రెస్ కు 2 లక్షల 49 వేల , 400 ఓట్లు అధికంగా వచ్చాయి…అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ యస్ ఓడిపోయింది … కొత్తగూడెం అసెంబ్లీ నుంచి సిపిఐ కాంగ్రెస్ మద్దతుతో గెలిచింది …అక్కడ బీఆర్ యస్ అభ్యర్థి కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన జలగం వెంకట్రావుకు 53 వేల 789 ఓట్లు రాగా , బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన వనమా వెంకటేశ్వరరావు కు కేవలం 37 వేల 555 ఓట్లు వచ్చాయి.. అంటే గెలిచినా సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు కు 80 వేల 336 ఓట్లు వచ్చాయి…అంటే బీఆర్ యస్ మీద కూనంనేని 42 వేల 781 ఓట్లు మెజార్టీ వచ్చింది …అంటే ఎటు చూసిన కాంగ్రెస్ కు తిరుగులేని ఆధిక్యం ఉంది … దీంతో సహజంగానే కాంగ్రెస్ సీటు ఆశించే వారి సంఖ్య అరడజనకు పైగానే ఉంది …బీఆర్ యస్ నుంచి ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప సిట్టింగ్ ఎంపీ నామ పోటీ ఖాయం….మరి కాంగ్రెస్ నుంచి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది ….

కాంగ్రెస్ లో అసలెవరు …కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే అరడజను మంది పోటీ పడుతున్నారు …వారిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ప్రధమవరసలో ఉన్నారు …గత మూడు పర్యాయాలు భట్టి గెలుపులో ఆమెదే కీలక పాత్ర … ఆమె ఇటీవల ఒక ఇంటర్యూ లో కూడా తాను పోటీచేయాలనుకుంటే అడ్డులేదని అన్నారు …ఆమె గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీకి ఆశక్తి చూపారు ..అయితే సీఎల్పీ నేతగా ఉన్న భట్టి వారించడంతో వెనక్కు తగ్గారు … ఇక సీనియర్ రాజకీయ నేత రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు …మొన్నటి ఎన్నికల్లో తండ్రి గెలుపులో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు … అయితే తుమ్మల దీనిపై తన మనుసులో మాట వెల్లడించలేదు … సామజిక వర్గాల సమీకరణాల్లో ఖమ్మం సీటు కమ్మ సామాజికవర్గానికి ఇవ్వక తప్పదని అందువల్ల తనకు అవకాశం ఉందని ఆయన అంటున్నారు …కాంగ్రెస్ కు అనుకూల వాతారవరణం ఉండటం రాష్ట్రంలో అధికారంలో ఉండటం తండ్రి కీలక పదవిలో ఉండటం ఆయనకు అనుకూల అంశాలుగా ఉంటాయి…ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు కూడా వినిపిసుంది… ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో అంతా తానై నడిపించారు … పొంగులేటి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డి లోకసభకు పోటీపై ఎక్కడ తన మనసులోని మాటను బయట పెట్టలేదు …సామజిక సమీకరణాల్లో రెడ్డి సామాజికవర్గానికి ఖమ్మం ఎంపీ సీటు ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది …గత ఎన్నికల్లో సామాజికవర్గాల సమీకరణాల్లో కేసీఆర్ సిట్టింగ్ ఎంపీ గా ఉన్న పొంగులేటికి టికెట్ ఇవ్వ నిరాకరించి, నామను టీడీపీ నుంచి బీఆర్ యస్ చేర్చుకొని సీటు ఇచ్చారు …ఇక ఖమ్మం ఆడపడుచుగా చెప్పుకుంటున్న మాజీ కేంద్రమంతి రేణుకాచౌదరి నాదే ఖమ్మం ఎంపీ టికెట్ అంటున్నారు …సీనియర్ కాంగ్రెస్ నేత వి .హనుమంతరావు కూడా ఖమ్మం పై ఆశలు పెట్టుకొని పావులు కదుపుతున్నట్లు సమాచారం …అయితే రేణుకాచౌదరి , వి .హెచ్ లకు కాకుండా కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం… ఖమ్మం కు చెందిన వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కూడా కాంగ్రెస్ లో తన పరిచయాలు ఆధారంగా ప్రయత్నాలు ప్రారంభించారు …మరో మాజీ ఎమ్మెల్యే తిరిగి కాంగ్రెస్ కు చేరి ఖమ్మం ఎంపీగా పోటీచేయాలని ప్రయత్నిస్తున్నట్లు సంచరం …

మరో కీలక పరిణామ కూడా చోటు చేసుకొనే అవకాశం ఉందని అంటున్నారు … కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీచేయించాలని టీపీసీసీ భావిస్తుంది ..ఈమేరకు పీసీసీ లో తీర్మానం కూడా చేశారు …అందువల్ల కాంగ్రెస్ కు అనుకూలమైన సీటు గా ఉన్న ఖమ్మం నుంచి ఆమె పోటీచేసే అవకాశాలు తోసిపుచ్చలేమని అంటున్నారు కాంగ్రెస్ నేతలు ..ఇదే జరిగితే ఖమ్మం నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులకు నిరాశ తప్పక పోవచ్చు ….చూద్దాం ఏమి జరుగుతుందో….!

Related posts

ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలడం మానుకోవాలి…మంత్రి పొంగులేటి

Ram Narayana

ఖమ్మంలో వేడెక్కిన రాజకీయాలు ….అందరి చూపు ఖమ్మం వైపే …

Ram Narayana

Ram Narayana

Leave a Comment