Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ప్రధాని నరేంద్రమోదీకి తాను రాసిన పుస్తకం కాపీని అందించిన ప్రణబ్ కూతురు

  • ‘ప్రణబ్ మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ అనే బుక్‌ను రాసిన శర్మిష్ఠ ముఖర్జీ
  • ఇందులో తన తండ్రితో మోదీకి ఉన్న అనుబంధాన్ని పేర్కొన్న శర్మిష్ఠ
  • తన తండ్రి ప్రణబ్ పట్ల మోదీ సానుకూల ధోరణితో ఉన్నారంటూ ట్వీట్ 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయ, రచయిత్రి శర్మిష్ఠ ముఖర్జీ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. తాను రాసిన ‘ప్రణబ్ మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ అనే పుస్తకం కాపీనీ ప్రధానికి అందించారు. తన తండ్రితో ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న బలమైన వ్యక్తిగత అనుబంధాన్ని ఈ పుస్తకంలో శర్మిష్ఠ పేర్కొన్నారు. కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ… తన తండ్రి ప్రణబ్ పట్ల మాత్రం సానుకూల ధోరణితో ఉండేవారని… ఈ విషయం తెలిసి తన తండ్రి ఆశ్యర్యపోయారని పేర్కొన్నారు.

తాను ప్రధాని మోదీకి ఈ పుస్తకం కాపీనీ అందించానని శర్మిష్ఠ ముఖర్జీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ మేరకు ఫోటోలు షేర్ చేశారు. ‘ప్రణబ్ మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ అనే పుస్తకం కాపీని ప్రధానికి అందించానని… ఆయన ఎప్పటిలాగే తన పట్ల ఆదరాభిమానాలు చాటారని, తన తండ్రి పట్ల గౌరవం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. ఇందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ ముగించారు.

Related posts

న్యాయదేవతకు ‘కళ్ల గంతలు’ తొలగింపు.. చారిత్రాత్మక ఘట్టం!

Ram Narayana

మోదీ బాధ నిజ‌మే అయితే బీరేన్ సింగ్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసి ఉండేవారు: మ‌ల్లికార్జున ఖ‌ర్గే..

Drukpadam

ఐదేళ్లూ ఆయనే సీఎం….మంత్రి పాటిల్ కీలక వ్యాఖ్యలు..

Drukpadam

Leave a Comment