Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై భిన్నాభిప్రాయాలు.. సీజేఐకు నివేదించిన ద్విసభ్య ధర్మాసనం

  • తీర్పులో భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన ద్విసభ్య ధర్మాసనం
  • మాజీ ముఖ్యమంత్రికి 17 ఏ వర్తిస్తుందన్న జస్టిస్ అనిరుద్ద బోస్
  • వర్తించదన్న జస్టిస్ బేలా ఎం. త్రివేది
  • విస్తృత ధర్మాసనానికి అప్పగించాలంటూ సీజేఐకు విజ్ఞప్తి

స్కిల్ కేసులో తన అరెస్టు అక్రమమంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. న్యాయమూర్తులు ఇద్దరూ వేర్వేరుగా తీర్పు వెలువరించారు. ముందుగా తీర్పు వెల్లడించిన జస్టిస్ బోస్.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే, జస్టిస్ బేలా ఎం. త్రివేది మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించదని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ద్విసభ్య ధర్మాసనం విజ్ఞప్తి చేసింది.

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సెప్టెంబర్ 9న అధికారులు అరెస్టు చేశారు. మెడికల్ గ్రౌండ్స్ పై మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చిన చంద్రబాబు.. తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందారు. అయితే, తన అరెస్టు సందర్భంగా సీఐడీ అధికారులు నిబంధనలు పాటించలేదని, గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు.

విపక్ష నేతగా తనకు ఐపీసీ సెక్షన్ 17 ఏ కింద ప్రొటెక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. చంద్రబాబు వాదనలను హైకోర్టు తిరస్కరించింది. దీంతో చంద్రబాబు తరఫున ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బాలా ఎం త్రివేది వాదనలు విన్నారు. చంద్రబాబుకు సెక్షన్ 17 ఏ వర్తించదంటూ ఏపీ సీఐడీ వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం గతేడాది అక్టోబరు 20న తీర్పు రిజర్వ్ చేసింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణలో ఇద్దరు జడ్జిలు ఏమన్నారంటే…!

Supreme Court refers Chandrababu quash petition before large bench

స్కిల్ కేసులో సీఐడీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. 

అయితే, ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది మధ్య తీర్పులో ఏకాభిప్రాయం కుదరలేదు. విపక్ష నేత హోదాలో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుధ్ బోస్ పేర్కొనగా, చంద్రబాబుకు 17ఏ వర్తింపజేయలేరని జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్యానించారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో, సుప్రీంకోర్టు  ఈ కేసు విచారణ బాధ్యతను విస్తృత ధర్మాసనం ముందుకు ప్రతిపాదించింది. ఇరువురు న్యాయమూర్తుల తీర్పులు ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

జస్టిస్ అనిరుధ్ బోస్ స్పందిస్తూ.. “అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుంది. పదవిలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపితే అది చట్టవ్యతిరేకం అవుతుంది. 1988 చట్టంలోని సెక్షన్ 13(1) (సి), సెక్షన్ 13 (1) (డి), సెక్షన్ 13 (2) కిందికి వచ్చే  నేరారోపణలపై తగిన (గవర్నర్) అనుమతులు తీసుకోకుండా చంద్రబాబును విచారించలేరు. ఈ కేసులో చంద్రబాబును విచారించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అనుమతి తీసుకోవచ్చు. ఆ మేరకు అనుమతి కోసం సంబంధిత వర్గాలకు దరఖాస్తు చేసుకోవచ్చు” అని వివరించారు.

అయితే జస్టిస్ బేలా త్రివేది తన సహ న్యాయమూర్తి జస్టిస్ అనిరుధ్ బోస్ తీర్పును వ్యతిరేకించారు. 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే 17ఏ వర్తిస్తుందని స్పష్టం చేశారు. 2018లో చట్ట సవరణ జరగ్గా… అంతకుముందు జరిగిన నేరాలకు దీన్ని వర్తింపజేయలేరని తెలిపారు. అవినీతి ప్రజాప్రతినిధులకు ప్రయోజనం కలిగించడం సెక్షన్ 17ఏ లక్ష్యం కాదని అన్నారు. ఈ సెక్షన్ ను కచ్చితంగా అమలు చేస్తే చాలామంది అసహనానికి గురవుతారు అని వివరించారు.

Related posts

వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు..!

Ram Narayana

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టులో విచారణ

Ram Narayana

ఈడీ తన అరెస్ట్ కు ఆధారాలు చూపించలేదని కోర్టులో కేజ్రీవాల్ వాదన…

Ram Narayana

Leave a Comment