Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులకు – టీడీపీ, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట

  • ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు వెళ్తున్న టీడీపీ, జనసేన శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
  • అనుమతి లేదంటూ అడ్డుకున్న వైనం
  • కొడాలి నానిని ఎలా అనుమతించారని ప్రశ్నించిన వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ, జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. విగ్రహం వద్దకు వెళ్లకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు – టీడీపీ, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. 

ఈ సందర్భంగా పోలీసులపై గుడివాడ టీడీపీ ఇన్ఛార్జీ వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం వద్దకు వెళ్లేందుకు కొడాలి నానిని అనుమతించి… తమను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ విషయం గురించి తెలుసుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరు: కొడాలి నాని

  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ఫ్లెక్సీలను తొలగించారంటూ కొన్ని ఛానళ్లలో వార్తలు
  • జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై బాలయ్య పడ్డారని కొడాలి నాని మండిపాటు
  • వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు
Balakrishna and Chandrababu can not don anything to Junior NTR says Kodali Nani

నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్టుగా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ… వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి మంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు. 

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారమ్మని పిలుస్తోందని అన్నారు. తన కొడుకునే సీఎం చేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కన పెట్టేసిన నేతలే చంద్రబాబును కలుస్తున్నారని అన్నారు.

Related posts

బలం లేకున్నా పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నామినేషన్!

Ram Narayana

నేను చంద్రబాబు అంత మంచోడ్ని కాదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

Ram Narayana

టీడీపీని వీడి వైసీపీ పంచన చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

Ram Narayana

Leave a Comment