Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటం మాత్రమే చేసింది: మంత్రి పొంగులేటి

  • గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని బయటకు తీస్తామని హెచ్చరిక
  • మేడారం జాతరకు ప్రభుత్వం రూ.105 కోట్లు ఇస్తోందని వెల్లడి
  • ప్రజల సొమ్ము వృథా కాకుండా చూస్తామన్న పొంగులేటి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటం మాత్రమే చేసిందని… వ్యక్తిగత లాభం కోసం పనులు చేశారని… కానీ ప్రజల గురించి ఆలోచించలేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని బయటకు తీస్తామని హెచ్చరించారు. మేడారం జాతరకు ప్రభుత్వం రూ.105 కోట్లు ఇస్తోందన్నారు. ఈ జాతర పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో మంత్రులకు కూడా గౌరవం దక్కలేదని విమర్శించారు. తాము ప్రజల సొమ్ము వృథా కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

వరంగల్‌లో మంత్రి పొంగులేటి అధికారులతో సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూం ఇళ్లపై చర్చించినట్లు వెల్లడించారు. వరంగల్ సమీక్షలో భూకబ్జాలపై కూడా చర్చించామన్నారు.

Related posts

అడ్డగోలు అవినీతి …ఆపై కటకటాలపాలు…

Ram Narayana

తెలంగాణలో మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు!

Ram Narayana

హోంగార్డులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

Ram Narayana

Leave a Comment