Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్ను బొందపెడ్తాం.. పులి బయటకొస్తే చెట్టుకు వేలాడదీస్తా : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ను బొందపెడ్తాం.. పులి బయటకొస్తే చెట్టుకు వేలాడదీస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫిబ్రవరిలో పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేళాడదీస్తామని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో బొందపెడతామన్నారు.

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కంపెనీల తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో సియం రేవంత్ భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీపై మండి పడ్డారు. కేసీఆర్ ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి లండన్ వేదికగా స్పందించారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చూద్దామన్నా కూడా కనిపించదన్నారు రేవంత్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రా ష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తే ఉండదు. ఒక్క ఎన్నిక విషయంలోనే బీఆర్ఎస్ నేతలు బొ క్కబోర్లా పడ్డరు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత నాదే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత వారికి భయం పట్టుకుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు.


:

Related posts

టికెట్స్ కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి …కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Ram Narayana

ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలడం మానుకోవాలి…మంత్రి పొంగులేటి

Ram Narayana

అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి.. డిప్యూటీ సీఎం చేస్తా: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment