Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అయోధ్య వార్తలు

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సంబరాలు.. దేశవ్యాప్తంగా ముస్తాబైన నగరాలు.. ఫొటోలు, ఇవిగో!

  • ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరణ
  • నేపాల్ లోని జనక్ పూర్ లోనూ సంబరాలు
  • మహారాష్ట్రలోని చంద్రపూర్ లో వేల దీపాలతో రామ నామం

బాల రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ జన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దీపాల కాంతుల్లో నగరం మెరిసిపోతోంది. రామ మందిరం ప్రవేశ ద్వారాన్ని పూలతో అలంకరించారు. వీధుల్లో తోరణాలు, గోడలపై రామాయణ గాథను తెలిపే చిత్రాలతో అయోధ్య నగరం మెరిసిపోతోంది. కాగా, అయోధ్యతో పాటు దేశవిదేశాల్లోనూ సంబరాలు జరుగనున్నాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా పలు నగరాలు కూడా ముస్తాబయ్యాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

పలుచోట్ల ఏర్పాటు చేసిన లైట్ షోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ లో వేలాది దీపాలతో ‘సియావర్ రామచంద్ర కీ జై’ అంటూ నినదించారు. చాందా క్లబ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగింది. జమ్మూకశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవీ ఆలయం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది. శ్రీరాముడి అత్తారిళ్లు నేపాల్ లోని జనక్ పూర్ లోనూ సంబరాలు జరుగుతున్నాయి.

మహారాష్ట్రలోని చంద్రపూర్ లో..

పంజాబ్ లోని చండీగఢ్ లో..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో..

నేపాలో లోని జనక్ పూర్ లో..

Related posts

ప్రాణప్రతిష్ఠ తెల్లారి నుంచే మళ్లీ నిర్మాణ పనులు

Ram Narayana

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

Ram Narayana

అయోధ్య ఆలయంలోని పాత విగ్రహాన్ని ఎక్కడ ఉంచుతారంటే..!

Ram Narayana

Leave a Comment