Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు: జూపూడి ఫైర్…

రాష్ట్రంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు: జూపూడి ఫైర్
-రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలి
-రాష్ట్రంలో అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యలు
-దళితుల కోసం ఏంచేశారో చెప్పాలని డిమాండ్
– దొంగలు మళ్ళీ అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణ

ప్రతిపక్ష నేతగా 40 సంవత్సరాల రాజకీయంగా అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు తాను అధికారంలో లేనని ఒకే ఒక కారణంతో క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మండి పడ్డారు .నిత్యం ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయడం ,కుట్రలు చేయడం తప్ప చంద్రబాబు చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు . రాష్ట్రంలో అభివృద్ధి చూసి చంద్రబాబుకు నిద్రపట్టడంలేదని జూపూడి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలనలో రాజ్యాంగానికి అత్యున్నత గౌరవం లభించిందని అన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి పాలసీని సీఎం జగన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు తన పాలనలో దళితుల కోసం ఏంచేశారో చెప్పాలని ఆయన నిలదీశారు.

రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కడ జరిగాయో చంద్రబాబు చూపించాలని అన్నారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడడం చంద్రబాబు నైజం అని జూపూడి విమర్శించారు. ప్రభుత్వంపై కుట్రలు చేయడమే చంద్రబాబుకు పనిగా కనిపిస్తోందని ఆరోపించారు. దొంగలు మళ్లీ అధికారంలోకి రావడం కోసం కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని జూపూడి హెచ్చరించారు.

Related posts

లోకసభ సీట్లను 1000 కి పెంచనున్నారా?

Drukpadam

ఎన్నికల ముందు బీజేపీ శ్రీరామ జపం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని ధ్వజం …

Ram Narayana

బీజేపీ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడిని ఖండించిన అమిత్ షా!

Drukpadam

Leave a Comment