- భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ
- మేఘాలయలో కొనసాగుతున్న పాదయాత్ర
- ఓ పండ్ల దుకాణాన్ని సందర్శించిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర మేఘాలయ రాష్ట్రంలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మేఘాలయలోని ఓ గ్రామంలో ఉన్న పండ్ల దుకాణాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న ఫలాలను ఆసక్తిగా తిలకించారు. అంతేకాదు, నోరూరించే మేఘాలయ పైనాపిల్స్ ను రుచిచూశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. మేఘాలయ పైనాపిల్స్ ప్రపంచంలోనే రుచికరమైనవని కాంగ్రెస్ పేర్కొంది.