Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మమతా బెనర్జీ లేని I.N.D.I.A. కూటమిని ఊహించలేం: జైరాం రమేశ్

  • కూటమికి మమతా బెనర్జీ బలమైన మూలస్థంబాలు అని రాహుల్ గాంధీ చెప్పారన్న జైరాం రమేశ్
  • బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారని గుర్తు చేసిన కాంగ్రెస్ నేత
  • బీజేపీని ఓడించేందుకు ఏమైనా చేస్తామన్న జైరాం రమేశ్

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేని I.N.D.I.A. కూటమిని కాంగ్రెస్ పార్టీ  ఊహించలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపినప్పటికీ కుదరలేదని తెలిపారు. అందుకే 42 లోక్ సభ స్థానాల్లో తాము పోటీ చేయాలని నిర్ణయించినట్లు మమత తెలిపారు. ఈ నేపథ్యంలో జైరాం రమేశ్ మాట్లాడారు. 

గురువారం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్‌లోకి ప్రవేశించనుంది. తనకు కనీసం సమాచారం అందలేదని మమతా బెనర్జీ వాపోయారు. ఈ అంశంపై జైరాం రమేశ్ స్పందిస్తూ… I.N.D.I.A. కూటమికి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ చాలా బలమైన మూలస్థంబాలని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ లేని కూటమిని ఊహించలేమన్నారు. 

బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారని.. కమలం పార్టీని ఓడించేందుకు తాము ఏమైనా చేస్తామని జైరాం రమేశ్ చెప్పారు. కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో 42 సీట్లకు గాను కాంగ్రెస్ పది నుంచి పన్నెండు స్థానాలను కోరుతోందని తెలుస్తోంది. కానీ మమతా బెనర్జీ కేవలం రెండు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో.. నాలుగు సీట్ల చొప్పున మాత్రమే గెలిచింది.

Related posts

బీజేపీ ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేదు …

Ram Narayana

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకు పంచేస్తుంది.. మోదీ సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

ఉపఎన్నికల్లో ఇండియా కూటమిదే ఆధిక్యం ….ఇండియా 4 …ఎన్డీయే 3

Ram Narayana

Leave a Comment