Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు …హోరెత్తిన సంబరాలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరానికి విచ్చేసిన ఆయనకు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు.డప్పులు, తీన్మార్ బ్యాండ్, నెత్తిమీద బిందెలతో లంబాడీ మహిళల నృత్యాలతో,టపాకాయలు కాల్చుతూ ఎంపీ రవిచంద్రకు ఘన స్వాగతం పలికారు.ఎంపీ రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా బురహాన్ పురంలోని క్యాంప్ కార్యాలయంలో వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఖమ్మం, కొత్తగూడెం,వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి బంధుమిత్రులు,మున్నూరుకాపు ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ఎంపీ వద్దిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గజమాలలు,పూలదండలు, పుష్పగుచ్ఛాలిచ్చి,శాలువాలతో ఆత్మీయ సత్కారం చేశారు.ఎంపీ రవిచంద్ర గౌరవార్థం ఏర్పాటు చేసిన సన్మానసభ మున్నూరుకాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ అధ్యక్షతన జరిగింది.టీయూడబ్ల్యూ జె (ఐజేయూ ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ,కె .రాంనారాయణ ,టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు ,ఏనుగు వెంకటేశ్వరరావు , యూనియన్ జిల్లా కోశాధికారి నాగెళ్ల శివానంద్, యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణు గోపాల్ రావు , ఎన్. వెంకట్రారావు , ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్ ,కనకం సైదులు ,మామిడాల భూపాల్ , నగర అధ్యక్ష కార్యదర్శులు మైసా పాపారావు,చెరుకుపల్లి శ్రీనివాస్ , నాయకులు మాధవరావు , రమేష్, పురుషోత్తమ్ ,వేణు ,కళ్యాణ్ ,టీజేఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి , రమేష్ , రంజిత్ , కోటేశ్వరరావు ,శ్రీనివాస్ పలువురు సీనియర్ జర్నలిస్టులు ఎంపీ వద్దిరాజుకు తమ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు లంబాడీ మహిళలతో కలిసి ఆడిపాడి సభికులను మరింత ఉత్సాహపర్చారు.ఎంపీ రవిచంద్ర సన్మానసభకు లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్, కొత్తగూడెం మునిసిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ,పార్టీ నాయకులు ఆర్జేసీ కృష్ణ, దిండిగల రాజేందర్,ఎడవల్లి కృష్ణ,ఉప్పల వెంకటరమణ,శీలంశెట్టి వీరభద్రం,కాపు కృష్ణ,రాపర్తి శరత్, లింగాల రవికుమార్,తోట రామారావులు హాజరై శుభాకాంక్షలు చెప్పారు.కార్పోరేటర్స్ శీలంశెట్టి రమ,గోళ్ల చంద్రకళల ఆధ్వర్యాన మహిళలు ఎంపీ రవిచంద్రను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ వద్దిరాజు చేత రవన్న యువసేన,రవన్న సేవా సమితి సభ్యులు భారీ కేక్స్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకుని, హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.ఎంపీ వద్దిరాజు జన్మదినం సందర్భంగా యువత,అభిమానులు హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసం,ఆ చుట్టుపక్కల, ఖమ్మం బురహాన్ పురం, దాని పరిసరాలలో హోర్డింగులు,ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఎంపీ రవిచంద్రకు స్వాగతం పలుకుతూ అభిమానులు పూలుజల్లుతూ”జై రవన్న జైజై రవన్న”,”వర్థిల్లాలి వర్థిల్లాలి రవిచంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి”అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ ఛైర్మన్ మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, ప్రముఖ వ్యాపారవేత్త వేములపల్లి వేములపల్లి వెంకటేశ్వరరావు, ప్రముఖ విద్యావేత్త పీ.ఉషాకిరణ్ కుమార్,కో-ఆపరేటీవ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ నాయకులు కనకం జనార్థన్,బోజెడ్ల ప్రభాకర్,యూనియన్ బ్యాంక్ ఏజీఎం జేవీరావు,మేనేజర్ వినోద్,ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చిన్ని కృష్ణారావు,జనరల్ సెక్రటరీ మెంతుల శ్రీశైలం, వంగవీటి మోహనరంగా అభిమాన సంఘం అధ్యక్షుడు కేతినేడి భాస్కర కుమార్, నందమూరి బాలకృష్ణ యువసేన అధ్యక్షులు నల్లమల రంజిత్, కార్యదర్శి సతీష్, ప్రైవేటు పాఠశాలలు,కళాశాలల బాధ్యులు శ్రీధర్,భాస్కర్, ప్రముఖ కరాటే మాస్టర్ జల్లెల శ్రీనివాసరావు,మున్నూరుకాపు ప్రముఖులు ఆళ్ల కృష్ణ,మేకల భిక్షమయ్య, కనిశెట్టి విజయ్ కుమార్,పొన్నం వెంకటేశ్వర్లు,మడూరి పూర్ణ, వల్లాల ప్రసాదరావు, గోపాలరావు ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు,మూలగుండ్ల శ్రీహరి,వెల్మినేటి రమేష్,మాదంశెట్టి వీరన్న,డేగల రమేష్,తీగల విజయ్,రాపర్తి రాజా,వెంపటి ఉపేందర్, మాటేటి రవి, నాగసాయి రాజశేఖర్,గొట్టం శ్రీనివాస్ తదితరులు ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు చెప్పారు.యూత్ లీడర్స్ పాల్వంచ రాజేష్,గౌరిశెట్టి వినోద్,సుంకర చిరంజీవి, నానబాల హరీష్,ఆకుల సాయి,బోయిన కార్తీక్,భానుప్రతాప్, ఆకుల వినయ్,గుమ్మడెల్లి హరీష్, తుపాకుల సాయి తదితరులు ఎంపీ రవిచంద్రకు పుష్పగుచ్ఛాలిచ్చి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ వద్దిరాజు జన్మదినం సందర్భంగా ఆయన క్యాంప్ ఆఫీస్ వద్ద సుమారు 5వేల మంది భోజనాలు చేశారు.ఖమ్మం జహీర్ పురా ఎస్టీ కాలనీ 32వ డివిజన్ లో ఎంపీ వద్దిరాజు చిరకాల అభిమాని ధోన్వాన్ అరుణ్ నాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.మానసిక వికలాంగులైన పలువురు బాలబాలికలు ఎంపీ రవిచంద్రను కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

రవిచంద్ర పెద్దల సభలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని, తెలంగాణ ప్రజల గొంతును బలంగా వినిపిస్తున్నారని లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు అన్నారు.తక్కువ కాలంలోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ రాజ్యసభ లోపల,బయట తెలంగాణ ప్రజల తక్షణ సమస్యల పరిష్కారానికి రవిచంద్ర తన వంతు కృషి చేశారని,చేస్తున్నారని ఆయన కొనియాడారు.రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం బురహాన్ పురంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.రవిచంద్రకు పుష్పగుచ్ఛమిచ్చి, శాలువాతో సత్కరించారు.రవిచంద్ర పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులుగా తెలంగాణలో ఫిల్లింగ్, ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకు పాటుపడి ఆ రంగానికి చెందిన వారితో పాటు అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని ఎంపీ నామ ప్రశంసించారు.పుట్టినరోజు వేడుకలు అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరుపుకోవడం సంతోషదాయకమని, ఈవిధంగా రవిచంద్ర ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని ఎంపీ నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

త్వరలో రానున్న లోకసభ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఘన విజయం చేకూర్చేందుకు తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.తన పుట్టినరోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ నామకు వద్దిరాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కొత్తగూడెం, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఎన్నికల ఇంఛార్జిగా పట్టుదలగా పనిచేసినట్టే,నామ గెలుపునకు పాటుపడుతానని వివరించారు.తామిద్దరిది అన్నదమ్ముల అనుబంధమని, తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాడామన్నారు.పదవిలో ఉన్నా, లేకున్నా కూడా బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ ఉన్నతికి కృషి సల్పుతానని ఎంపీ రవిచంద్ర అన్నారు.ఈ కార్యక్రమంలో జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్ మాట్లాడుతూ,ఎంపీ రవిచంద్ర సేవాతత్పరతను కొనియాడారు.

Related posts

ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ యస్ నేతలు …

Ram Narayana

కీంకర్తవ్యం … ఖమ్మం కాంగ్రెస్ నేతల సమాలోచనలు…

Ram Narayana

ఎంపీల సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై ఎంపీ రఘురాంరెడ్డి

Ram Narayana

Leave a Comment