- ఫాలోవర్లకు సండే విషెస్ చెప్పిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్
- నిప్పులపై నడిచేటప్పుడు ఎలా వ్యవహరించామన్నదే ముఖ్యమని కామెంట్
- ధైర్యంగా తలెత్తుకుని ముందుకు సాగాలని సూచన
స్మితసబర్వాల్ తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిణి…బీఆర్ యస్ అధికారంలో ఉండగా సీఎంఓ లో ఆమె మాటకు తిరుగులేదు …ముఖ్యమంత్రి ప్రత్యేకకార్యదర్శిగా ఉన్న ఆమె ఇరిగేషన్ ప్రోజెక్టుల సందర్శనకు హెలికాఫ్టర్ లో తిరిగారు …ఇది అప్పట్లోనే కొంతమంది సీనియర్ ఐఏఎస్ లకు రుచించలేదని గుసగుసలు వినిపించాయి.. ఆమె సీఎం అప్పగించిన భాద్యతలు తూచ తప్పకుండాపాటించి కేసీఆర్ మెప్పు పొందారు …మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు …కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది …కొత్త ముఖ్యమంత్రిని అధికారులు కలిసి అభినందించడం ఆనవాయితీ కానీ ఆమె సీఎం ను ఇంతవరకు కలవలేదు …ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా ఉండే మంత్రి సీతక్కను కలిశారు …తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కొత్త భాద్యతలు అప్పగించింది …ఆమె బాధ్యతల్లో కొనసాగుతూ గత ఆదివారం పెట్టిన “నిప్పులమీద నడక” పోస్ట్ వైరల్ గా మారింది ..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే, తాజాగా ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘నిప్పులపై నడిచేటప్పుడు ఎలా ఉన్నామన్నదే ముఖ్యం. తలెత్తుకుని సగర్వంగా ముందుకు సాగాలి. హ్యాపీ సండే గైస్’’ అంటూ తన ఫాలోవర్లను ఉద్దేశిస్తూ ఆమె పోస్ట్ పెట్టారు.
స్మిత పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. స్థిరచిత్తంతోనే ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. కఠిన పరిస్థితుల్లో ప్రయాణమే మనకు కొత్త శక్తినిస్తుందని కొందరు అన్నారు.