Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్

  • ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్
  • అంబేడ్కర్ సచివాలయంలో కలిసిన హైకమిషనర్
  • రేవంత్ రెడ్డితో పాటు ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం సాయంత్రం కలిశారు. అలెక్స్ ఎల్లిస్ వెంట తెలంగాణ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురాం, ఎంఈఏ బ్రాంచ్ సెక్రటరియేట్ హెడ్ జె.స్నేహజ తదితరులు వున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.

లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్ లో హైదరాబాద్ లో మూసీనది పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు.

ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బ్రిటిష్ హై కమీషనర్ అలెక్స్ ఎల్లిస్ తో భేటీ అయ్యారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు, నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. మూసి నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామని

Related posts

డిప్యూటీ సీఎం భట్టి నివసిస్తున్న ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు …

Ram Narayana

బండి సంజయ్‌తో గ్యాప్ లేదు… ఈటల

Drukpadam

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకు ధర్మశాస్త్రం …డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్.

Ram Narayana

Leave a Comment