Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యూస్ ఇన్ బ్రీఫ్ …….

మొబైల్‌ ఐసీయూ బస్సులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

 

హైదరాబాద్‌ : మొబైల్‌ ఐసీయూ బస్సులను మంత్రి కేటీఆర్‌ గురువారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్‌ మొబైల్‌ బస్సులను అందించిన లార్డ్స్‌ చర్చికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లో మెడికల్‌ యూనిట్‌ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. తొలి విడుత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. కొవిడ్‌ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్‌ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు.

మెడికల్‌ యూనిట్‌ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయి.

 

మత్తడి దుకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం..పరిశీలించిన మంత్రి పువ్వాడ.

 

 

౼ నెరవేరిన ప్రజల చిరకాల స్వప్నం.

౼ త్రాగునీటి సమస్యకు చెక్.

౼ మేయర్ తో కలిసి పరిశీలించిన మంత్రి పువ్వాడ.

ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్లో రూ.7.45కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పై నుండి నీరు మత్తడి దుకుతున్న తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి పరిశీలించారు.

వృధాగా నీరు దిగువకు పోకుండా మంత్రి పువ్వాడ ముందుచూపుతో ప్రకాష్ నగర్ వద్ద నీటిని నిల్వ చేయడం ద్వారా మండు వేసవిలో కూడా త్రాగునీటి ఏడాదికి చెక్ పెట్టగలిగారు.

నిండు కుండలా కళకళలాడుతూ మత్తడి దుకుతున్న దృశ్యాన్ని చూసి నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇక అన్ని కాలాల్లో సంవృద్దిగా నీరు నిల్వ ఉండటంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 

చిల్పూర్‌లో సీఎం కేసీఆర్‌ విగ్రాహావిష్కరణ..
జనగామ జిల్లాలోని చిల్పూర్‌ మండల కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది అడుగుల విగ్రహాన్ని సర్పంచ్ ఉద్దమర్రి రాజ్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్‌ స్వ రాష్ట్ర కలను నిజం చేశారు. ఆయన పోరాట స్ఫూర్తికి గుర్తుగా సీఎం కేసీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామని సర్పంచ్‌ తెలిపారు.

ఎంపీ నామ చొరవతో మంజూరైన ..
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

  • రూ .3.94 లక్షల విలువైన 9 చెక్కులు అందజేత

ఖమ్మం: కరోనా కష్టకాలంలో టిఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేనున్నాంటూ పేదలకు భరోసానిస్తూ అండగా నిలుస్తున్నారు . ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న తర్వాత ప్రభుత్వ సాయం కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న పేదలకు సకాలంలో ఆర్థికసాయం మంజూరు చేయించి , ఆదుకుంటున్నారు . తాజాగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన తోట వెంకన్న , దోనోతు నాగమణి , బండి పుల్లయ్య ( గూడూరుపాడు ) . షేక్ లతీఫా ( పెద్దతండా , గుంజా గురవమ్మ ( తీర్థాల ), తిరుమలాయపాలెం ముండలం ఎదుళ్ల చెరువుకు చెందిన భూక్యా లక్ష్మి , కాకరవాయికి చెందిన ఉప్పునూతల నాగేశ్వరరావుకు మంజూరైన రూ . 3.94 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఖమ్మంలోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు . ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి మాట్లా డుతూ సీఎంఆర్‌ఎఫ్ ద్వారా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేద వర్గాలకు అండగా నిలు స్తుందన్నారు . ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని , సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ తో మాట్లాడి , త్వరితగతిన పేదలకు ఆర్థిక సాయం మంజురయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు . ఎంపీ నామ ఆదేశాల మేరకు లాక్డౌన్ లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవు తున్నదని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంప్ ఆఫీస్ ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ , పార్టీ నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్ , తమ్మినేని కృష్ణయ్య ఉప్పునూతల నాగేశ్వరరావు . నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్ , చీకటి రాంబాబు , కృష్ణప్రసాద్ , తాళ్లూరి హరీష్ తదితరులు పాల్గొన్నారు . .

 

శ్రీ రామోజీ రమేశ్‌ ‘మహోన్నత’ పోలీస్ సేవాపతకం
-పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించిన ప్రభుత్వం

ఖమ్మం: ఖమ్మం ట్రాఫిక్‌ ఏసీపీ రామోజీ శ్రీ రమేశ్‌కు మహోన్నత సేవా పతకం లభించింది.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8 మందికి మహోన్నత సేవా పతకాలు ప్రకటించగా అందులో శ్రీరామోజు రమేశ్‌ ఒకరు.ఈ అవార్డు కింద ఆయనకు బహుమతిగా రూ.40 వేల అవార్డు, ప్రశంసా పత్రం లభించనున్నాయి. శ్రీరామోజి రమేష్ ఎలాంటి వివాదాస్పదం లేకుండా విధినిర్వాణలో మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేసిన ఆయనకు ప్రజల్లో కూడా మంచి అధికారిగా గుర్తింపు ఉంది .

ఖమ్మం జిల్లాలో మొత్తం 18 మంది పోలీసులు సేవా పతకాలు అందుకుంటున్నారు.

ఇందులో సత్తుపల్లి 15వ బెటాలియన్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.చంద్రశేఖర్‌కు ఉత్తమ సేవా పతకం లభించింది.

సేవా పతకాలు అందుకున్న వారిలో..

ఎస్‌.కామేశ్వరరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ (ఖమ్మం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌), మఠం సంగయ్య, ఏఆర్‌ ఎస్సై(ఖమ్మం), దామెర్ల మోహన్‌రావు, ఏఆర్‌ ఎస్సై(ఖమ్మం), బి.హేమంత్‌, కానిస్టేబుల్‌(ఖమ్మం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌), సాదు సదానందం, హెడ్‌ కానిస్టేబుల్‌(ఖమ్మం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌), కటికల సూర్యప్రకాశ్‌రెడ్డి, కానిస్టేబుల్‌(తల్లాడ ఠాణా), భరద్వాజ్‌ బిజేందర్‌ సింగ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌(ఖమ్మం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌), ఎం.హుస్సేన్‌ బేగ్‌, కానిస్టేబుల్‌ (ఖమ్మం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌), ఎం.వెంకటప్పరావు, కానిస్టేబుల్‌ (ఖమ్మం టూటౌన్‌ పీఎస్‌-ఐటీ సెల్‌), ఐ.మన్మథరావు, ఏఎస్సై, (వీఎం బంజర), కె.రంగయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌(ఖానాపురం హవేలీ ఠాణా), బి.హరికృష్ణ, కానిస్టేబుల్‌ (తిరుమలాయపాలెం ఠాణా), టి.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్‌ (ఖమ్మం వన్‌ టౌన్‌ పీఎస్‌) ఉన్నారు.

సత్తుపల్లి 15వ బెటాలియన్‌ నుంచి అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఆర్‌.నాగేశ్వరరావు, బి.గంగారామ్‌, ఏసీబీ నుంచి కానిస్టేబుల్‌ బి.సురేశ్‌కుమార్‌, అగ్నిమాపక శాఖ నుంచి వైరా ఫైర్‌ స్టేషన్‌ లీడింగ్‌ ఫైర్‌మాన్‌ బి.మాధవరావు సేవా పతకాలు అందుకున్నారు.

పతకాలు అందుకున్న వారికి ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

మహోన్నత సేవ గ్రహితను అభినందించిన మంత్రి పువ్వాడ.

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న పోలీస్ శాఖ ఉత్తమ సేవ పథకాల్లో ఖమ్మం ట్రాఫిక్ ACP రామోజీ రమేష్ గారికి మహోన్నత సేవ పథకం వరించింది.

రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన వాటిలో మొత్తం 8 కాగా అందులో ఖమ్మం ట్రాఫిక్ ACP రామోజీ రమేష్ గారికి రావడం, పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకమైన మహోన్నత సేవ పథకం పొందడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అభినందించారు.

గురువారం మంత్రి పువ్వాడ ను ACP రామోజీ రమేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి పువ్వాడ శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఖమ్మం నగరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ట్రాఫిక్ సమస్యలను అధిగమించగలిగామని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణకై సిగ్నల్స్ ఏర్పాటుతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నిర్విరామంగా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో విశేష కృషి చేశారని కొనియాడారు.

 

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..
* అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఎఏస్పీ స్నేహ మెహ్రా

ఖమ్మం: పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వాసవి గార్డెన్ లో విత్తన, ఎరువుల షాపుల అసోసియేషన్ మరియు డీలర్లు, దుకాణా యజమానులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసిన వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్‌ కావడంతో రైతన్నలు ఫర్టిలైజర్‌ దుకాణాలకు వస్తుంటారని, వారికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు ఒరిజినల్‌ బిల్లులు ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసుల సమన్వయంతో నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో ఐదు టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు నిషేధిత మందులు విక్రయిస్తే లైసెన్స్‌ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారి విజయలక్ష్మి వివరించారు. ఎరువులు, విత్తనాలు, మందుల విక్రయాలకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని సూచించారు. లైసెన్స్‌ గల డీలర్‌ నుంచి మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు సూచించారు. ఎఏస్పీ స్నేహ మెహ్రా, ఏసీపీ అంజనేయులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామానుజం, సిఐ శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి విజయలక్ష్మి, సరిత (ADA) శ్రీనివాస్ రెడ్డి (ADA), కిషోర్ (వ్యవసాయ అధికారి)
చాయా (వ్యవసాయ అధికారి), సందీప్ (జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్) రామనాధం రావు, (ఖమ్మం జిల్లా విత్తనాలు మరియు ఎరువుల దుకాణాల సంఘం అధ్యక్షుడు) మనోహర్ రావు (కార్యదర్శి) తదితరులు పాల్గొన్నారు.

 

గొల్లపాడు ఛానల్ పనులు ఆలశ్యం ప్రజలకు ఇక్కట్లు ……

 

ప్రకాష్ నగర్ 28 వ డివిజన్ లో గోళ్ళపాడు ఛానెల్ ఆధునీకరణ పనులు ఆలస్యం గా నడుస్తుండటంతో ప్రకాష్ నగర్ పోలీసు లైన్ ఏరియా కల్వర్టు నుండి కాల్వ కట్ట వైపు ఇళ్ళ మధ్యన మట్టి పూడ్చకపోవడం వల్ల ఈరోజు ఉదయం కురిసిన వర్షానికి ఇం.నెం 4-6-223/1 మరియు దాని చుట్టుపక్కల రెండు ఇండ్ల ప్రహారీ కూలిపోయి సుమారు రెండు లక్షల నష్టం వాటిల్లింది దీనికి కారణం గోళ్ళపాడు ఛానెల్ ఆధునీకరణ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ నష్టాన్ని ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు గమనించి ఈ గోళ్ళపాడు కాల్వ నిర్మాణ కాంట్రాక్టరు వద్ద నుండి నష్టపరిహారం ఇవ్వాలని ఈ వాట్సప్ వేదిక ద్వారా అధికారులకు మనవి చేసుకుంటున్నాను

 

కరోనా ను అరికట్టడం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం.

 

ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి.

  • ప్ల కార్డులతో నిరసన

  • సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ

ఖమ్మం : కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి విమర్శించారు. గురువారం సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఆఫీస్ వద్ద జిల్లా కమిటీ సభ్యులు విక్రం అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, కరోనా కేసులు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ దొరకక ప్రజల ప్రాణాలు పోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆమె అన్నారు . పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు . కరోనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. . ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు . వెంటనే జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ , జిల్లా నాయకులు ప్రకాష్ , బషీర్ , ఎండీ గౌస్ , నర్రా రమేష్ , మేకల నాగేశ్వరరావు , మాచర్ల గోపాల్ , కాంపాటి వెంకన్న , ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

టి వి చౌదరి జ్ఞాపకార్థం బీవీకే కేంద్రానికి బ్రీతింగ్ మిషన్ అందజేత

కామ్రేడ్ తుళ్లూరి వెంకయ్య చౌదరి (T V చౌదరి ) గారి మొదటి వర్ధంతి సందర్బంగా, కామ్రేడ్ తుళ్లూరి లెనిన్ గారు బోడెపూడి విజ్ఞాన కేంద్రం బీవీకే ఐసొలేషన్ కేంద్రంలో ఉంటున్న covid.19 భాద్యులకు బ్రీతింగ్ ఎక్సర్సిస్స్ స్పైరల్ మీటర్స్ ను కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం చేతుల మీదుగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి sk రంజాన్ సిపిఎం వైరా అసెంబ్లీ ఇన్చార్జి భూక్యా వీరభద్రం అందజేసినారు

 

రైల్వే శాఖ లో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి ÷DYFI జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్

ఖమ్మం : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI)ఆలిండియా కమిటి పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఖాళీ పోస్ట్ భర్తీ చేయాలని , పోస్ట్ ల ఎత్తివేత కు నిరసనగా ప్లే కార్స్డ్ ప్రదర్శన చేయడం జరిగింది . ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ ప్రదాని మోడి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మాట తప్పటమే కాకుండా ఉన్న ఉద్యోగాలు పికెస్తున్నాడని , ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రవైట్ పరం చేస్తు భవిష్యత్తులో అసలు ఉద్యోగాలులేకుండా చేస్తున్నారని దానిలో భాగంగానే రైల్వే లాంటి పెద్ద శాఖ ను కూడా ప్రవైట్ వారికి ఇచ్చేందుకు సిద్దం అయ్యాడని ఆయన అన్నారు . అందుకే దినికి వ్యతిరేకంగా DYFI ఆలిండియా కమిటి ఈరోజు పిలుపునిచ్చిందని . ఈపిలుపులో భాగంగా స్థానిక సుందరయ్య భవనం దగ్గర నిరసనగా ప్లే కార్స్డ్ ప్రదర్శన చేయడం జరిగింది ఆయన తెలియజేశారు . ఈ కార్యక్రమం లో DYFI జిల్లా నాయకులు భూక్యా ఉపేందర్ నాయక్, సత్తెనపల్లి నరేష్, సారంగి పాపారావు,కనపర్తి గిరి,కూరపాటి శ్రీను,రావులపాటి నాగరాజు,యాటా రాజేష్,సాంభ,ఆర్ ప్రకాష్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు .

 

CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

◆ 94 చెక్కులకు గాను రూ. 42.58 లక్షలు, నేటి వరకు రూ.5.83 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ.

వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం CMRF కి దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సిఫారసు మేరకు మంజూరైన CMRF చెక్కులను మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు Vdo’s కాలనీ క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు పటిస్తూ అందజేశారు.

మొత్తం 94 మందికి గాను రూ.42.58 లక్షల విలువైన చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. నేటి వరకు రూ.5.83 కోట్ల విలువైన చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

 

క‌రోనాతో మృతి చెందిన భువనగిరి సాక్షి టీవీ రిపోర్ట‌ర్ గిరిబాబు కుటుంబానికి రూ.1ల‌క్ష ఆర్ధిక‌సాయం  భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి
 50 వేల రూపాయల నగదు  డీసీసీ అధ్యక్షులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి…

 

యాదాద్రి భువనగిరి జిల్లా
విధి నిర్వ‌హ‌ణ‌లో క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. భువనగిరి సాక్షి టీవీ రిపోర్ట‌ర్ శానకొండ గిరిబాబు మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా గిరిబాబు కుటుంబానికి రూ. 1ల‌క్ష ఆర్ధిక సహాయాన్ని స్థానిక కాంగ్రెస్ నేత‌ల‌తో వలిగొండ పట్టణ కేంద్రంలోని గిరి నివాసంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఇవ్వడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

కరోనా వ్యాధితో అకాల మరణం చెందిన భువనగిరి సాక్షి టీవీ రిపోర్టర్ శానకొండ గిరిబాబు కుటుంబాని పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి…

తక్షణ సహాయం కింద 50 వేల రూపాయల నగదు భార్య మాధవి కి అందజేత….

గిరి ఇద్దరు కుమార్తెల చదువుల పై స్పష్టమైన భరోసానిచ్చిన అనీల్ రెడ్డి…

 

Related posts

అమెరికా వెళ్లే విద్యార్థులకు విమానయాన సంస్థల షాక్.. చార్జీలు అమాంతం పెంపు

Drukpadam

అమితాబ్‌ను ముస‌లోడా అన్న నెటిజ‌న్‌… సుతిమెత్త‌గానే బుద్ధి చెప్పిన బిగ్ బీ!

Drukpadam

మతాంతర వివాహాలకు అత్యధికులు వ్యతిరేకమే : తాజా సర్వే…

Drukpadam

Leave a Comment