- తెలంగాణ బిడ్డనని షర్మిల చెప్పుకుందన్న కారుమూరి
- బాబు, పవన్ దొంగలు పంచుకుంటున్నట్టు సీట్లు పంచుకుంటున్నారని ఎద్దేవా
- ‘సిద్ధం’ సభ ఫిబ్రవరి 1కి వాయిదా పడిందని వెల్లడి
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ బిడ్డను అని చెప్పుకున్న షర్మిల… అక్కడ నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచి ఇక్కడకు వచ్చారని విమర్శించారు. దొంగలు పంచుకున్నట్టుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్లను పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమావాస్య రోజున పుట్టిన పొత్తు ఏ రకంగా ఉంటుందో తాము ముందే ఊహించామని చెప్పారు. తన తల్లిని తిట్టిన వాళ్ల చంక పవన్ ఎక్కారని అన్నారు. ఏలూరులో ఈ నెల 30న జరగాల్సిన ‘సిద్ధం’ సభ ఫిబ్రవరి 1కి వాయిదా పడిందని చెప్పారు. ఆ రోజున జరిగే సభలో రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. గత ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశామో చెప్పడమే ఈ సభ లక్ష్యమని చెప్పారు.