Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పిడుగు పడి ఒకేరోజు 31 మూగజీవాలు మృతి…

అరకులోయ :

విశాఖ ఏజెన్సీలో ఒకే రోజు రెండూ ప్రాంతాల్లో పిడుపాటుతో భారీ నష్టం 31 ముగాజీవులు మృత్యువాత

అరకులోయ మండలం మాదల పంచాయతీ మెదర్ సొల చిట్టంగొంది బాక్సైట్ అటవీ ప్రాంతంలో బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ పిడుగు పడింది.ఈ పిడుగుపాటుకు 13 ఆవులు 6 మేకలు మృత్యువాత పడ్డాయి.పశువులు కాయడానికి వెళ్ళిన గెమ్మెలి.భీమన్న అనే గిరిజనుడు తోపాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.దీనితో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అరుకు ఏరియా ఆస్పత్రికి డోలిమోత సహాయంతో బంధువులు తీసుకుని వెళ్ళారు.బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కె.రామరావు గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్నలు డిమాండ్ చేశారు.ఈ ఘటనతోపాటు డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ సిలంగొంది అటవీ ప్రాంతంలో పిడుపడి 12 దుక్కిటెద్దులు మృతి చెందాయి.ఒకేసారి గిరిజన కుటుంబాల్లో ఇంత భారీ నష్టం జరగడంతో గిరిజనులు మున్నీరు అవుతూ ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన చెందుతున్నారు.

Related posts

రాహుల్ గాంధీ.. మాటలు జారొద్దు!: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Drukpadam

అతిధుల సమక్షంలో పంజాబ్ సీఎం మాన్ వివాహం !

Drukpadam

ఏప్రిల్ 6 న నాగార్జున సాగర్ ,తిరుపతిలకు ఉపఎన్నికలు…?

Drukpadam

Leave a Comment