Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

ఎంపీ వద్దిరాజుకు రాజ్యసభ ఛైర్మన్ శుభాకాంక్షలు

రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.శాసనసభ్యులు మీ సేవల పట్ల మరింత నమ్మకం కలిగి, విశ్వాసం వ్యక్తం చేస్తూ రాజ్యసభకు తిరిగి ఎన్నుకున్నారని తన సందేశంలో ఛైర్మన్ పేర్కొన్నారు.రాజ్యసభకు తిరిగి ఎన్నికైన తర్వాత ఎంపీ రవిచంద్ర ఛైర్మన్ ధనఖర్ ను బుధవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రవిచంద్రతో ఛైర్మన్ మాట్లాడుతూ “ఈ ప్రజాస్వామ్య దేవాలయం(పార్లమెంట్)లో అర్థవంతమైన,ఆరోగ్యకరమైన చర్చలు జరిపేందుకు నీ అనుభవం చాలా అవసరం”అని పేర్కొన్నారు.”నీ సమయస్పూర్తి,విషయ పరిజ్ఞానం,సమర్థత, వ్యక్తీకరణ పార్లమెంట్ ఔన్నత్యాన్ని మరింత పెంచగలవు”అంటూ నీతో కలిసి పని చేయడానికి తాను ఎదురుచూస్తున్నానని వద్దిరాజుతో ఛైర్మన్ ధనఖర్ అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తనకు శుభాకాంక్షలు తెలిపిన ఛైర్మన్ జగదీప్ ధనఖర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు, ధన్యవాదాలు చెప్పారు.

Related posts

ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరం.. అన్న ఖర్గే వ్యాఖ్యలతో రాజ్యసభలో దుమారం…

Ram Narayana

 పీఎం కిసాన్ మొత్తం పెంపు అంశంపై కేంద్రం స్పందన

Ram Narayana

హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుపై లోక్‌సభలో ఈటల ప్రశ్న!

Ram Narayana

Leave a Comment