Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ

  • కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న సద్గురు
  • అపోలో ఆసుపత్రిలో 17న బ్రెయిన్ సర్జరీ
  • ఆరోగ్యం స్థిరంగా ఉందని… వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పిన అపోలో ఆసుపత్రి డాక్టర్

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఈ రోజు సాయంత్రం సద్గురు బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. 

గత నాలుగు వారాలుగా, సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, మహాశివరాత్రితో సహా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. మార్చి 15న ఆయనకు ఎంఆర్ఐ పరీక్షలు చేయగా మెదడులో భారీ రక్తస్రావం కనిపించిందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ తన బిజీ షెడ్యూల్‌లో భాగంగా ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ను వాయిదా వేసుకోవడానికి నిరాకరించారని తెలిపారు. పవన్‌ఫుల్ పెయిన్ కిల్లర్స్‌ను ఉపయోగించి ఆ కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పారు.

17వ తేదీ ఉదయం సద్గురును ఆసుపత్రికి తీసుకువచ్చారని, ఆయన మెదడులో ప్రాణాంతక వాపును గుర్తించినట్లు డాక్టర్ తెలిపారు. 17న అత్యవసర శస్త్రచికిత్స చేశామని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన బాగా కోలుకుంటున్నట్లు చెప్పారు. 

మేం చేయగలిగింది చేశాం కానీ మీ మనోధైర్యంతో మీకు మీరే నయం చేసుకుంటున్నారని ఆయనతో సరదాగా అన్నామని డాక్టర్ వినీత్ సూరి తెలిపారు. సద్గురు మేం ఊహించినదాని కంటే వేగంగా కోలుకుంటున్నారని, చాలా బాగా ఉన్నారని, మెదడు, శరీరం, ఇతర అవయవాల్లో వేగవంతమైన స్థిరమైన కనిపిస్తోందన్నారు.

Related posts

బరువు తగ్గాలనుకునే వారికి.. జామాకులతో మంచి ఫలితం

Ram Narayana

అడుగు’తో ఆరోగ్యం.. రోజుకు 20 వేల అడుగులతో గుండె జబ్బులు పరార్!

Ram Narayana

రూ. 450కే డెంగీకి ప్రపంచంలోనే అత్యుత్తమ చికిత్స అందిస్తానంటున్న డాక్టర్!

Ram Narayana

Leave a Comment