Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

అధిష్టానం వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పంచాయతీ…

అధిష్టానం వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పంచాయతీ…
ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో ఎత్తులు ,పై ఎత్తులు …
తమవారికంటే తమవారికే టికెట్ కావాలంటున్న మంత్రులు
ఖమ్మంలో విషయంలో తాను జోక్యం చేసుకోనని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

మంచితరుణం మించిన దొరకదు …ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు ఇంత మంచి అవకాశం రాదు .. ఈజీగా కాంగ్రెస్ ఖాతాలో పడే సీటు కావడంతో తమవారికి టికెట్ ఇప్పించుకుంటే గెలుపు సునాయాసం అనుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు తమ కుటుంబసభ్యులకు ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి…దీంతో గెలుపు సంగతి సరే ముందు టికెట్ తెచ్చుకోవడం దుర్లభంగా మారింది … ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అన్ని పనులు పక్కన పెట్టి టికెట్ వేటలో మంత్రులు నిమగ్నమైయ్యారు …

తమవారికే టికెట్ దక్కించుకోవాలని నేతలు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు ఆసక్తికరంగా మారాయి … టికెట్ ఎవరికి వచ్చినా, అందరం కలిసి పనిచేస్తామని చెపుతున్నప్పటికీ పైకి నవ్వులు కురిపిస్తూనే లోపల విషం నింపుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం టికెట్ విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోనని , జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తేల్చుకోవాలని ఖరాకండిగా చెప్పడంతో టికెట్ పంచాయతీ ఢిల్లీకి మారింది …దీంతో తమవారికి టికెట్ వచ్చేలా ఎవరి రూట్ లో వారు ఏఐసీసీ పెద్దలవద్ద పావులు కదుపుతున్నారు …రాష్ట్రంలో ఉన్న 17 లోకసభ సీట్లలో ఖమ్మం , బోనగిరి ,నాగర్ కర్నూల్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారింది …ప్రత్యేకించి ఖమ్మం సీటు విషయంలో ముగ్గురు మంత్రులు కీలకమైన వారే అయినందున అధిష్టానం సైతం ఆచితూచు అడుగులు వేస్తుంది …

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రజలు , ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు జైకొట్టారు …ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడూ నియోజకవర్గాల్లో ఆరు ,కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా , కొత్తగూడం లో కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ విజయం సాధించినది … రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఈ లోకసభ పరిధిలో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులు కావడంతో గెలుపు ఖమ్మం ఎంపీ సీటు గెలవడం నల్లేరు పై నడకేనని అభిప్రాయాలూ ఉన్నాయి…దీంతో ఇక్కడ టికెట్ తెచ్చుకుంటే గెలుపు ఖాయమనే అభిప్రాయం ఉండటంతో ఎవరికీ వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ….ప్రధానంగా ముగ్గురు మంత్రుల బంధువులు టికెట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న, ఖమ్మం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల తనయుడి కోసం మంత్రిగా పెద్దగా పట్టు పట్టకపోయినా తనయుడు డాక్టర్ యుగంధర్ మాత్రం తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నేతలు చుట్టూ తిరుగుతున్నారు … డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని , రెవెన్యూ , గృహనిర్మాణ , సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు ..వారి కోసం మంత్రులు సైతం పట్టుబడుతున్నారు … రోజుకొక పేరు టికెట్ రేసులో ముందున్నట్లు షికార్లు చేస్తుంది …చివరికి అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో చూడాలి మరి …!

Related posts

ఖమ్మంలో బీజేపీ దూకుడు …

Ram Narayana

నేను చీటర్ ను కాదు …ఫైటర్ ను …ఖమ్మం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పువ్వాడ..

Ram Narayana

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతం… 70 శాతం పైగా పోలింగ్…

Ram Narayana

Leave a Comment