Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సికింద్రాబాద్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

  • ముఖ్యనేతలతో చర్చించి అందరి అభిప్రాయం సేకరించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా పద్మారావు గౌడ్ 
  • సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన నేత అన్న బీఆర్ఎస్

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొంది.

సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Related posts

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం: యూపీ సీఎం యోగి

Ram Narayana

కామ్రేడ్స్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ …17 స్థానాలకు పోటీచేస్తామని సిపిఎం ప్రకటన…

Ram Narayana

నామ గెలుపు ఖాయం ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది …”దృక్పధం” తో మాజీమంత్రిపువ్వాడ…

Ram Narayana

Leave a Comment