ఇటీవల తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కె. శ్రీనివాస్ రెడ్డిని, సుమన్ టీవీ చైర్మన్ సుమన్ మర్యాద పూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిజంలో దాదాపు యాభై యేండ్ల అనుభవం, అవగాహన కలిగి ఉండడమే కాకుండా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ సంపాదకులు శ్రీనివాస్ రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించడం మీడియా రంగంలో శుభ పరిణామమని సుమన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కిరణ్ కుమార్, అజిత, హెచ్.యూ.జే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.