బాబోయ్.. భారత్ బెటర్ …. యూకేలో పరిస్థితి దారుణంగా ఉంది…
-బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విజేత కౌశల్ భార్య నీలిమ
-ఉద్యోగరీత్యా యూకేలో ఉంటున్న నీలిమ
-వారం రోజుల క్రితం సోకిన కరోనా
-ఆసుపత్రిలో ఒక్క పారాసిటమాల్ మాత్రమే ఇచ్చారని ఆవేదన
-భారత్‌లోనే మెరుగైన వైద్యం అందుతోందన్న నీలిమ
కరోనా కు చికిత్స భారత్ లో ఎంతో బెటర్ …. నిజంగా ఇది నిజం ఎందుకంటే ఉద్యగా రీత్యా బ్రిటన్ లో ఉంటున్న తనకు కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్ కు వెళ్లెను వాళ్ళు ఒక్క పేరాసెటమాల్ మాత్ర మాత్రమే ఇచ్చి కరోనా కు ఇంతే ఇంతకన్నా ఏమిలేవని అన్నారు. ఆశ్చర్యం వేసింది. ఇదే భారత్ లో అయితే అనేక రకాల మందులు ఉన్నాయి. అని బిగ్ బాస్ తెలుగు సీజన్-2 విజేత కౌశల్ భార్య నీలిమ అంటూ బ్రిటన్ మందులు వైద్యం పై లబోదిబో మన్నారు…..
బిగ్‌బాస్-2 విజేత కౌశల్ మండా భార్య నీలిమ తనకు యూకేలో ఎదురైన దారుణ ఘటనను సోషల్ మీడియా ద్వారా వివరించి భారతీయులకు ధైర్యం చెప్పారు. ఉద్యోగం నిమిత్తం ప్రస్తుతం యూకేలో ఉన్న ఆమె వారం రోజుల క్రితం కరోనా బారినపడ్డారట.
దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు చాతీలో నొప్పి కూడా వచ్చిందట. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు ఒక్క పారాసిటమాల్ మాత్ర మాత్రమే ఇచ్చి సరిపెట్టారట. వైద్యులు ఏమాత్రం పట్టించుకోకపోగా, కరోనా లక్షణాలు అలాగే ఉంటాయని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు.
నిజానికి కరోనా చికిత్స విషయంలో భారత్‌లోనే దారుణ పరిస్థితులు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారని, అది ముమ్మాటికీ తప్పని ఆమె తేల్చేశారు. యూకేలో చికిత్స ఎంతో గొప్పగా ఉంటుందని భావించానని, కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని నీలిమ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం ఇదేనని పేర్కొన్నారు.
కరోనాకు మన దేశంలో చక్కని వైద్యం లభిస్తోందని, కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తానిప్పుడు బాగానే ఉన్నానని, త్వరలోనే ఇండియాకు తిరిగి వస్తానని చెప్పారు. నీలిమ చెప్పిన తన అనుభవాల వీడియోను కౌశల్ తన యూట్యూబ్ చానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.