Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అయోధ్య కు .. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు

  • వెల్లడించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులోకి
  • విమానాలు నడపనున్న స్పైస్‌జెట్
  • ప్రయాణ సమయం 2 గంటలు

అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రెండు గంటల్లోనే చేర్చనుంది. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ నుంచి విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అవే రోజుల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ చేరుకుంటుంది.

Related posts

త్వరలో ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ కాల్స్… ట్రాయ్ స్పందన

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా…దేశ విదేశాల్లో ప్రదర్శనలు !

Ram Narayana

మిజోరాంలో ఘోరం … నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మృతి

Ram Narayana

Leave a Comment