Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ ఖాళీ అవుతుంటే కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారు …డిప్యూటీ సీఎం భట్టి

బీఆర్ యస్ ఖాళీ అవుతుంటే బీఆర్ యస్ నేత కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్ వైఖరిపై ధ్వజమెత్తారు….సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల పేరుతో యాత్రలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు …కేసీఆర్ తప్పుడు లెక్కలు …దగుల్బాజీ మాటలను ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించిన విషయాన్నీ గుర్తు చేశారు …కాళేశ్వరం గురించి వాస్తవాలు మాట్లాడకుండా , జరిగిన తప్పులు ఒప్పుకోకుండా సొల్లు కబుర్లు చెప్పడం మానుకోవాలని భట్టి కేసీఆర్ కు హితవు పలికారు …

సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన మాటలు కొంచమైన వాస్తవాలు లేవు…వాస్తవాలను దాచి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు … 10 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారి మాట్లాడతారా? అని మండిపడ్డారు …కట్టు కథలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించడం దారుణమన్నారు …బిఆర్ఎస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మైక్ సమస్య వస్తే కరెంటు కోతలంటూ అబద్ధాలు మాట్లాడటం కేసీఆర్ కె చెల్లిందన్నారు ..
విద్యుత్ సరఫరా లేకుంటే వినియోగం ఎలా పెరిగిందని నిలదీశారు ..
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగింది గతంలో ఎన్నడు లేనంతగా నమోదయిన విషయాన్నీ గుర్తు చేశారు .. యాదాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌ ఎప్పుడు ప్రారంభించారు..?
ఎవరి వల్ల ఆలస్యమైంది..? యాదాద్రి ప్రాజెక్ట్‌ నిర్మించిన స్థలమే సరైంది కాదు.. బొగ్గు లభించే ప్రాంతానికి 350 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ గత ప్రభుత్వ నిర్మాణం చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు .. పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతులు పొందటం లో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని అన్నారు ..తెలంగాణకు 4వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందన్నారు …విభజన చట్టం ప్రకారమే రాష్ట్రానికి ఎన్టిపిసి మంజూరు అయిందన్నారు …సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాల్సి ఉండగా కమిషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో ప్లాంట్ నిర్మాణం చేపట్టింది కేసీఆర్ కదా అని ప్రశ్నించారు .. వచ్చే ఏప్రిల్, మే నెలలోనూ సరిపడా విద్యుత్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు …దేశమంతా గ్రిడ్ అనుసంధానం 2013 లోనే యూపీఏ ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు …

పదేండ్ల పాలనల్లో కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలి…అందరికీ రెండు పడకల గదులు ఇల్లు నిర్మించి ఇచ్చారా? ప్రతి మండలంలో బాల బాలికలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రతి నియోజకవర్గంలో కేజీ టు పీజీ విద్యాలయాలు నిర్మించారా? దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేశారా? రైతులకు రుణమాఫీ ఐదేళ్లలో పూర్తి చేశారా? అని నిలదీశారు …

వర్షాకాలంలో అధికారంలో ఉన్నది ఎవరు? వాన నీటిని రిజర్వాయర్లు నింపే పరిస్థితి లేకుండా చేసింది ఎవరు? ప్రపంచంలోనే అత్యద్భుతం అని చెప్పిన కాలేశ్వరం కృంగిపోయింది.
అన్ని లెక్కలతో చర్చలకు రావడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? బిఆర్ఎస్ నేతలకు భట్టి సవాల్ చేశారు … బీఆర్ఎస్ పాలకులు అస్తవ్యస్తంగా చేసిన పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం గాడిన పెడ్తుంటే తట్టుకోలేక అక్కసుతో కేసీఆర్ గారు మాపై అబద్ధపు, మోసపూరిత ప్రచారం చేస్తున్నారని అన్నారు ..

Related posts

ఎన్నికల్లో బీజేపీ తన శక్తిమేరకు సమర్థవంతంగా పని చేసింది: కిషన్ రెడ్డి

Ram Narayana

మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్…

Ram Narayana

హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. తప్పులు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక

Ram Narayana

Leave a Comment