Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కడియం శ్రీహరిని పార్టీలోకి ఎలా తీసుకుంటావ్?: రేవంత్ రెడ్డిపై మంద కృష్ణ మాదిగ మండిపాటు

  • పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 75 ఏళ్ల వయస్సులో ఇదేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడన్న మంద కృష్ణ
  • ఇప్పుడు అదే 75 ఏళ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఎలా పార్టీలోకి తీసుకున్నారని నిలదీత
  • బీఆర్ఎస్‌లో కడియం శ్రీహరికి అన్ని పదవులు ఇచ్చిందని గుర్తు చేసిన మంద కృష్ణ

సిగ్గులేని కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తీసుకుంటావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గతంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 75 ఏళ్ల వయస్సులో పార్టీ మారడం ఏమిటి? ఆయ‌న‌ సిగ్గులేనోడని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను మంద‌ కృష్ణ గుర్తు చేశారు. ఇప్పుడు అదే 75 ఏళ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఆ సిగ్గులేనోడిని ఎలా పక్కన కూర్చోబెట్టుకున్నాడు? ఎలా పార్టీలోకి తీసుకున్నాడు? అని నిలదీశారు.

బీఆర్ఎస్ క‌డియం శ్రీహ‌రికి అన్ని ప‌ద‌వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీతో పాటు చివ‌ర‌కు ఉపముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ను ఉపముఖ్యమంత్రిగా కూడా చేయలేదన్నారు. క‌డియం శ్రీహ‌రికి బీఆర్ఎస్ ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చిందన్నారు.

Related posts

తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం.. రెండో స్థానంలో బీఆర్ఎస్: లోక్ పోల్ సర్వే

Ram Narayana

కాంగ్రెస్ అభ్యర్థుల నాల్గొవ జాబితా …సూర్యాపేట లో పటేల్ రమేష్ రెడ్డికి మళ్ళీ నిరాశ…

Ram Narayana

కొడంగల్ అసెంబ్లీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ

Ram Narayana

Leave a Comment