ఖమ్మం ఎంపీ సీటు ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది …డిప్యూటీ సీఎం భట్టి
నీటికొరతకు కారణం బీఆర్ యస్ ముందుచూపు లేని పాలనే కారణం
అధికారపార్టీ బలంగా ఉంటేనే పాలనా సజావుగా సాగుతుంది …బీఆర్ యస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరికపై భట్టి
తుక్కుగూడ జనజాతరను లక్షలాదిగా ప్రజలు తరలి వస్తారన్న భట్టి
మల్లిఖార్జున ఖర్గే , రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు వెల్లడి
ఖమ్మం ఎంపీ సీటు ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుందని అది తనపరిధిలోని అంశంకాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు …తెలంగాణ రాష్ట్రంలో అన్ని సీట్లు ప్రకటించి ఒక్క ఖమ్మం ప్రకటించకపోవడాన్నివిలేకర్లు ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు ..భట్టి సతీమణి నందిని , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో భట్టి మాటలకూ ప్రాధాన్యత సంతరించుకుంది … గురువారం ఖమ్మం వచ్చిన భట్టి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ యస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయని కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు .. ఆర్థిక క్రమశిక్షణలేదు …ప్రాజెక్ట్ ల డిజైన్ల విషయంలో ఇష్టారీతిన వ్యవహరించారు ఫలితంగానే కాళేశ్వరం బ్యారేజ్ కుంగిపోయింది …ఖమ్మం జిల్లాలో కొద్దిగా ఖర్చు చేస్తే పూర్తీ కావాల్సిన రాజీవసాగర్ , ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ లను పడుకోబెట్టి కొత్తగా సీతారాం పేరుతో ఎస్టిమేషన్ పెంచి సాగదీశారు …7 వేల కోట్ల అంచనాలతో ప్రారంభమైన ప్రాజెక్ట్ ను 23 వేల కోట్లకు పెంచారు …పైగా తమ తప్పులను ఒప్పుకోకుండా నిస్సుగ్గుగా మాట్లాడుతున్నారు …పవర్ ప్రోజెక్టుల రూపకల్పనలో కూడా తొందరపాటు రాష్ట్ర ప్రజలకు భారంగా మారిందన్నారు ..ఇప్పటికే జెన్కో కు 27 వేల కోట్ల బకాయిలు పెట్టి బీఆర్ యస్ పోయిందని అన్నారు …యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ సరైన చోట నిర్మాణం జరగలేదని భట్టి అభిప్రాయపడ్డారు …బీఆర్ యస్ చేసిన పాపాలను ఆర్థిక భారాలను సరిచేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు …
రాష్ట్రంలో సాగు ,తాగునీరు ఏడాదికి కారణం బీఆర్ యస్ అవలంబించిన అస్తవ్యస్త విధానాలే కారణమని భట్టి దుయ్యబట్టారు …జులై , ఆగస్టు నెలల్లో వర్షాలు కురిస్తే వాటిని సరిగా ఉపయోగించుకొని ఫలితంగా ఈగతి పట్టిందని అన్నారు …అయినా ప్రజలు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు ..

బీఆర్ యస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై మాట్లాడుతూ తమ సజావుగా సాగాలంటే ప్రభుత్వం బలంగా ఉండాలని అన్నారు …అయితే ఎవరిని బలవంతంగా తమ పార్టీలో చేర్చుకోవడంలేదని , ప్రభుత్వాన్ని మరింత బలపర్చేందుకు ,ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జరుగుతున్న ప్రక్రియను అని పార్టీలు మారడాన్ని భట్టి సమర్ధించుకున్నారు …
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలమేరకు ఆరు గ్యారంటీలలో ఐదు అమలు చేస్తున్నాం …రైతు బందు జమ చేయడం దాదాపు పూర్తీ కావచ్చింది …ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ పాలనా దేశానికే ఆదర్శంగా ఉందని భట్టి పేర్కొన్నారు …అందుకే దేశంలో తెలంగాణ లాంటి పాలనా తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ను రేపు 6 వతేదీన తుక్కుగూడలో జరిగే జనజాతర సభలో విడుదల చేయనున్నట్లు చెప్పారు …లక్షలాది మందితో జరిగే ఈసభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే , పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు …రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు ..విలేకర్ల సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ , రాయల నాగేశ్వరావు , మహమ్మద్ జావేద్ , దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు …
ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం …దోషులు శిక్ష తప్పదు …భట్టి
పదేళ్లు అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదంటారా?: మల్లు భట్టివిక్రమార్క
పదేళ్లు పాలించారు కాబట్టి ఈ వ్యవహారంలో వారికి బాధ్యత ఉంటుందని వ్యాఖ్య
దేశ భద్రత కోసం, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్న భట్టివిక్రమార్క
ప్రతిపక్ష నేతలను నిర్వీర్యం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? అని ధ్వజం
ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ఆగ్రహం
పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అంటారా? అని బీఆర్ఎస్ నేతలపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. పదేళ్లు పాలించారు కాబట్టి ఈ వ్యవహారంలో వారికి బాధ్యత ఉంటుందన్నారు. దేశ భద్రత కోసం, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్నారు. కానీ ప్రతిపక్ష నేతలను నిర్వీర్యం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? అని ధ్వజమెత్తారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.
భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు? వ్యాపారులు ఏం మాట్లాడుకుంటున్నారు? అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారు? జడ్జిలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇలా అందరి జీవితాల్లోకి… వంటగదుల్లోకి… బెడ్రూంలలోకి వెళ్లి చూస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పౌరుల భద్రతకు పెను ప్రమాదమన్నారు. మీ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమాచారం ఎలా వచ్చిందో విచారణలో తేలుతుందన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్నారు.