తెలంగాణ వార్తలు

మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

  • లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్
  • అందరి వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్న పోలీసులు, ఎన్నికల సిబ్బంది
  • మధిర మండలం ఆత్కూర్ క్రాస్ వద్ద భట్టివిక్రమార్క వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో పోలీసులు అందరి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మధిర మండలం ఆత్కూర్ క్రాస్ వద్ద భట్టివిక్రమార్క వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వాహనం ఆపి తనిఖీలు పూర్తయ్యే వరకు భట్టివిక్రమార్క వాహనంలో కూర్చొని సహకరించారు. కారు వెనుక భాగం సహా అంతా తనిఖీ చేశారు. సహకరించినందుకు ఉపముఖ్యమంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యత …!

Ram Narayana

ఎం ఎం టి ఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం వార్తలపై స్పందించిన ప్రభుత్వం …

Ram Narayana

కేటీఆర్‌కు సుప్రీంకోర్టు షాక్: నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Ram Narayana