Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడగ్గానే మెడలోంచి బంగారు గొలుసు తీసిచ్చిన జగ్గారెడ్డి…

  • గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చిన అనిల్ కుమార్ యాదవ్
  • మీ ఆశీర్వాదంతో పాటు బంగారు గొలుసు ఇస్తే సంతోషిస్తానన్న ఎంపీ
  • బహుమతి ఇవ్వగానే పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న అనిల్ కుమార్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా తన మెడలోని బంగారు గొలుసును తీసి… రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మెడలో వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉగాది సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపేందుకు గాంధీ భవన్లో ఉన్న జగ్గారెడ్డి వద్దకు వచ్చారు. అయితే ఆశీర్వాదంతో పాటు బంగారం ఇస్తే సంతోషిస్తానని అనిల్ కుమార్ యాదవ్ సరదాగా అన్నారు. అడిగిన వెంటనే జగ్గారెడ్డి తన మెడలోని బంగారు గొలుసును తీసి అనిల్ కుమార్ యాదవ్ మెడలో వేశారు. వెంటనే అనిల్.. జగ్గారెడ్డి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

Related posts

సాంకేతిక కారణాల వల్లే అలా జరిగింది… రైతులు ఆందోళన చెందవద్దు: తుమ్మల

Ram Narayana

తెలంగాణలో 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం!

Ram Narayana

బీజేపీలో కీలక పరిణామాలు.. బండి సంజయ్ అసంతృప్తి

Drukpadam

Leave a Comment