Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తుమ్మల చొరవతో ప్రారంభానికి సిద్దమైన భద్రాద్రి రామయ్య వారధి!

……భద్రాచలం వద్ద గోదావరి నదిపై నూతన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్దమైంది.కేసీఆర్ మొదటి టర్మ్ పాలనలో నాడు జిల్లా మంత్రిగా తుమ్మల బ్రిడ్జి నిర్మాణం కు శంకుస్థాపన చేసారు.కానీ తుమ్మల ఓటమి తరువాత కేసీఆర్ రెండో టర్మ్ పాలనలో బ్రిడ్జి నిర్మాణం కు నిర్లక్ష్య గ్రహణం పట్టింది.దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాచలం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు.రేవంత్ సర్కార్ లో తుమ్మల మళ్లీ మంత్రిగా ఉండటంతో బ్రిడ్జి నిర్మాణం పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.శరవేగంగా బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యేలా ఫాలో అప్ చేయడంతో ఈ శ్రీ రామ నవమి నాటికి నూతన వారధి ప్రారభంకు రెడీ అయ్యింది.భద్రాచలం అభివ్రుద్ది పనుల్లో నాడు కరకట్ట నిర్మాణం నేడు నూతన వారధి నిర్మాణంతో మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేసారని భద్రాద్రి వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

..భద్రాచలం సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు సీతమ్మ తల్లితో కలసి నడయాడిన పుణ్యభూమి.శ్రీ మహావిష్ణువు శ్రీ రాముడు గా కొలువైన ఫుణ్యక్షేత్రం.దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం రామాలయం దర్శనం కోసం వేలాది మంది భక్తులు భద్రాచలం వస్తూంటారు. భద్రాచలం వెళ్లాలంటే గోదావరి దాటి వెళ్లాలి.1956 లో భక్తులతో భద్రాచలం వస్తోన్న పడవ గోదావరి లో నీట మునిగి 200 మంది *దుర్మరణం పాలయ్యారు.దాంతో చలించిపోయిన నాటి ప్రభుత్వం
భద్రాచలం వద్ద ఉన్న బ్రిడ్జి కి 1959
డిసెంబర్ 16 న నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేసారు .1965 లో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ బ్రిడ్జి ప్రారంభం చేశారు..అంతకు ముందు గోదావరి లో చప్టాలో మీదుగా ప్రయాణం. చేసేవారు.గోదావరి లో భక్తులు ప్రయాణం చేసే పడవ నీట మునిగి ఎంతో మంది పదే పదే దుర్మరణం చెందడంతో బ్రిడ్జి నిర్మాణం చేసారు.బాంబే కు చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ బ్రిడ్జి నిర్మాణం చేసారు.గత 50 ఏళ్లకు పైగా ఒకటే బ్రిడ్జి ఉండటం భద్రాచలం వచ్చే భక్తులు సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రెండో వారధి నిర్మాణం కోసం కేసీఆర్ పాలనలో ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం 65 కోట్ల అంచనా వ్యయం తో 2015 ఏప్రిల్ 1 న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తో కలసి శంకుస్థాపన చేసారు.కానీ రెండో టర్మ్ పాలనలో తుమ్మల ఓటమి తో గడిచిన 5 ఏళ్లు బ్రిడ్జి నిర్మాణం నత్తనడక సాగింది.

…..అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస ఘన విజయం సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం,తుమ్మల మళ్లీ మంత్రిగా నియామకంతో భద్రాచలం బ్రిడ్జి నిర్మాణం పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.మంత్రిగా డిసెంబర్ 7 న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం డిసెంబర్ 10 న భద్రాచలం రామాలయం దర్శనం చేసుకున్నారు.నాటి నుంచి నూతన బ్రిడ్జి నిర్మాణం నత్తనడక సాగడంపై అధికారులతో కాంట్రాక్ట్ ఏజెన్సీ తో మాట్లాడి నిత్యం పనులు పురోగతిపై మానిటర్ చేసారు.ఈ నెల 17 శ్రీ రామ నవమి నాటికి నూతన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పనులు సాగించారు.ఫలితంగా నూతన వారధి ప్రారంభోత్సవానికి సిద్దమైంది.
…భద్రాచలం అభివ్రుద్ది విషయంలో మంత్రి తుమ్మల నాడు చంద్రబాబు హయాంలో కరకట్ట నిర్మాణం చేసి గోదావరి జలగండం లేకుండా భద్రాద్రి కి కరకట్ట ను శ్రీ రామ రక్షగా మార్చారని స్థానికులు నాటి సీఎం చంద్రబాబు, మంత్రి తుమ్మల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.కరకట్ట నిర్మాణం తో చెరగని ముద్ర వేసుకున్న తుమ్మల, గోదావరి పై నూతన వారధి నిర్మాణం తో భద్రాచలం అభివ్రుద్ది బాట పట్టించిన విజనరీ లీడర్ గా భద్రాద్రి వాసులు మంత్రి తుమ్మల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts

ఉచిత ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో మహిళలకు టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి

Ram Narayana

యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్

Ram Narayana

గిత్తల జోడీ ధర రూ.కోటి మాత్రమే.. ఎందుకంత స్పెషల్ అంటే..!

Ram Narayana

Leave a Comment