- ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
- నేడు రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్
- ఆరుగురు లోక్ సభ అభ్యర్థులు, 12 మంది అసెంబ్లీ అభ్యర్థులతో జాబితా
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ మరికొందరు అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించింది. ఆరుగురు లోక్ సభ అభ్యర్థులు, 12 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ నేడు విడుదల చేసింది. తిరుపతి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం నుంచి మాజీ ఎంపీ చింతా మోహన్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక, ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి టెక్కలి అసెంబ్లీ టికెట్ దక్కించుకోగా, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పూతలపట్టు నుంచి మరోసారి బరిలో దిగనున్నారు.
లోక్ సభ అభ్యర్థులు…
విశాఖపట్నం- పులుసు సత్యనారాయణరెడ్డి
అనకాపల్లి- వేగి వెంకటేశ్
ఏలూరు- కావూరి లావణ్య
నరసరావుపేట- గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్
నెల్లూరు- కొప్పుల రాజు
తిరుపతి ఎస్సీ- డాక్టర్ చింతా మోహన్
అసెంబ్లీ అభ్యర్థులు…
టెక్కలి- కిల్లి కృపారాణి
భీమిలి- అద్దాల వెంకట వర్మ రాజు
విశాఖపట్నం సౌత్- వాసుపల్లి సంతోష్
గాజువాక- లక్కరాజు రామారావు
అరకు లోయ ఎస్టీ- శెట్టి గంగాధరస్వామి
నర్సీపట్నం- రూతల శ్రీరామమూర్తి
గోపాలపురం ఎస్సీ- సోడదాసి మార్టిన్ లూథర్
యర్రగొండపాలెం ఎస్సీ- డాక్టర్ బూదల అజితా రావు
పర్చూరు- నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
సంతనూతలపాడు ఎస్సీ- పాలపర్తి విజేశ్ రాజ్
గంగాధర నెల్లూరు ఎస్సీ- డి.రమేశ్ బాబు
పూతలపట్టు ఎస్సీ- ఎంఎస్ బాబు