ఖమ్మం ,హైద్రాబాద్ ,కరీంనగర్ ఎంపీ సీట్లపై రేపే కాంగ్రెస్ కీలక నిర్ణయం …!
ఖమ్మం నుంచి రోజుకోపేరుతో చక్కర్లు కొడుతున్న వార్తలు
హైద్రాబాద్, కరీంనగర్ పై ఒక నిర్ణయానికి పార్టీ వచ్చినట్లు సమాచారం
ఖమ్మం కిరికిరి పై చర్చించేందుకు హైద్రాబాద్ వస్తున్న కేసి వేణుగోపాల్
ముగ్గురు మంత్రుల అభిప్రాయాలను ఇప్పటికే తెలుసుకున్న అధిష్టానం
నామినేషన్లు వేసేందుకు నోటిఫికేషన్ విడుదలకు మరో నాలుగురోజులు టైం ఉంది …అయినా తెలంగాణ రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తికాలేదు …ప్రత్యేకంగా కాంగ్రెస్ ఖాతాలో పడే కొద్దీ సీట్లలో ఖమ్మం లోకసభ ఒకటి …దీంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారింది …మొదట మంత్రుల కుటుంబసభ్యులు పేర్లు వచ్చాయి…అయితే అధిష్టానం వారికీ నో చెప్పడంతో మరికొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి…అందులో వడపోత కార్యక్రమం చేపట్టారు …తాజా సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు ,వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి , వియ్యంకుడు రఘుమారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి…మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ,జట్టి కుసుమ కుమార్ ,మల్లు నందిని ,తుమ్మల యుగంధర్ పేర్లు వచ్చిన వాటిని పక్కన పెట్టారని విశ్వసనీయ సమాచారం …అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది ….మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్స్ ఇవ్వడంలేదని అధిష్టానం స్పష్టం చేసినప్పటికీ పార్టీలో చేరేటప్పుడు తనకు ఇచ్చిన హామీ మేరకు టికెట్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి కోరుతున్నారు …ఈవిషయంలో అధిష్టానం వద్ద తన అభిప్రాయాన్ని ఆయన కుండబద్దలు కొట్టారని సమాచారం …అధిష్టానం స్ఫష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది …అన్నమాటలకు కట్టు బడకపోతే ఎలా …మీరే ఆలోచించుకోండని తన నిరసన గళాన్ని వినిపించారని వినికిడి …దీంతో అధిష్టానం తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం….ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అభిప్రాయాలు అధిష్టానం తెలుసుకుంది ….
హైద్రాబాద్ కు కేసి వేణుగోపాల్ ….
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాజకీయ సలహాదారు కేసి వేణుగోపాల్ ఆదివారం హైద్రాబాద్ కు వస్తున్నట్లు సమాచారం …రాష్ట్రంలో ఎంపిక చేయాల్సిన మూడు లోకసభ సీట్లు అభ్యర్థులను ఫైనల్ చేయడం కోసం ఆయన వస్తున్నారని తెలుస్తుంది …ఇక్కడ ముఖ్యనేతలతో మాట్లాడి ఖమ్మం , హైద్రాబాద్ , కరీంనగర్ సీట్ల లో అభ్యర్థులను నిర్ణయించి అధిష్టానానికి పంపిస్తారని ఢిల్లీ నుంచి పేర్లు వెల్లడిస్తారని తెలుస్తుంది … హైద్రాబాద్ , కరీంనగర్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన అధిష్టానం ఖమ్మం విషయాన్నీ కూడా ఫైనల్ చేయనున్నది …
ఇంతకూ ఖమ్మానికి ఎవరు ….?
అయితే ఇంతకూ ఖమ్మం లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీచేస్తారు …? కాదు కాదు కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే ఆసక్తి నెలకొన్నది …ఎవరిని చేసిన స్థానిక నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ఇటు పార్టీ శ్రేణుల నుంచి అటు ప్రజల నుంచి వస్తుంది …అందువల్ల ఖమ్మం కు చెందిన రాయల నాగేశ్వరరావు , పోట్ల నాగేశ్వరరావు , వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, పొంగులేటి ప్రసాద్ రెడ్డి లలో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం ఉందని బోగట్టా …ఇందుకోసం మరో ఒకటి రెండు రోజులు ఆగాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ పెద్దలు …చూద్దాం ఏమి జరుగుతుందో ….