- రాజ్‌పుత్‌లు, క్షత్రియులు బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్య
- ఉత్తర ప్రదేశ్ ప్రజల స్పందన తమ పార్టీ పట్ల సానుకూలంగా ఉందని వెల్లడి
- ఓటు వేయడం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న అఖిలేశ్ యాదవ్
ఉత్తర ప్రదేశ్‌లో రేపు జరగనున్న తొలిదశ పోలింగ్ నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. రేపు యూపీలో మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ… రాజ్‌పుత్‌లు, క్షత్రియులు బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇది ఆ పార్టీకి ఎదురుదెబ్బే అన్నారు. తొలిదశ పోలింగ్ నుంచే బీజేపీ ఓటమి ప్రారంభమవుతుందన్నారు.
ఆయన ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ… ఉత్తర ప్రదేశ్ ప్రజల స్పందన తమ పార్టీ పట్ల సానుకూలంగా ఉందని, ఇది తమ విజయానికి దారి తీస్తుందన్నారు. ఓటు వేయడం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. బీజేపీ చెప్పేవన్నీ అవాస్తవమే అన్నారు. వారు తప్పుడు వాగ్దానాలు చేశారని విమర్శించారు. ప్రజలు ఈసారి స్పష్టమైన సందేశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన, దళిత, మైనార్టీలు ఎన్డీయేను తప్పకుండా ఓడిస్తారన్నారు.