Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఇంతకు లోకల్ నా …? నాన్ లోకలా …?

డామిట్ …కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపికలో ఎన్ని మలుపులో …ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఇంతకు లోకలా …? నాన్ లోకాల అనే చర్చ జరుగుంది …నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ప్రముఖంగా నిన్న ఈరోజు వినిపిస్తుంది …ఆయన కమ్మ జామాజికవర్గానికి చెందినవారు …అయితే మొదట టీడీపీ , తర్వాత బీఆర్ యస్ ,ఇటీవల కాలంలో కాంగ్రెస్ కు దగ్గర అయ్యారు …ఈ జిల్లాతో ఎలాంటి సంబంధం లేదు …రఘురామి రెడ్డి పక్కన ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన వారు వారికీ ఖమ్మం జిల్లాలో బంధాలు బంధుత్వాలు , ఆస్తులు ఉన్నాయి…పూర్వికులది కూసుమంచి మండలం చేగొమ్మ …నాన్ లోకల్ ఎంపిక పార్టీకి నష్టం జరుగుతుందనే అంటున్నారు పరిశీలకులు …

ఇప్పటికే పూటకొక అభ్యర్థి పేరుతో కాంగ్రెస్ అపహాస్యం పాలవుతున్న వైనం …కాంగ్రెస్ కంచుకోటలో అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు …ఇన్ని జరిగిన తర్వాత ప్రకటించే అభ్యర్థి వచ్చేదెన్నడు …ప్రచారం చేసే దెన్నడు …తమకు బలముంది కదా అన్ని అతి చేస్తే అందలం ఎక్కించిన ప్రజలే నేలకు కొట్టడం ఖాయం …ఇది చరిత్ర చెపుతున్న సత్యం అని తెలుసుకోవడం కాంగ్రెస్ నేతలకు మంచిది … వారు ఒప్పుకున్నా ,ఒప్పుకోకపోయినా అభ్యర్థి ఎంపిక లో జరుగుతున్న జాప్యంతో పార్టీ ప్రతిష్ట దిగజారుతుందనేది పార్టీ పెద్దలు తెలుసుకోవడం మంచిది …

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభయ్యింది … మరో ఐదు రోజుల్లో ఆ ప్రక్రియ ముగుస్తుంది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించపోవడం పై కార్యకర్తలు రగిలి పోతున్నారు … జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం లేదనే ప్రచారం జరుగుంది … మంత్రుల కుటుంబసభ్యులను టికెట్ కావాలనే దానిపై తర్జనభర్జనల అనంతరం వారికి టికెట్ ఇవ్వడంలేదని అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపింది … ఎవరిని పెట్టాలనే దానిపై మరల చర్చలు …తమ మాటనే నెగ్గించుకోవాలనే పంతాలు పట్టింపులు వెరసి కాంగ్రెస్ పుట్టిముంచేలా కనిపిస్తుంది …మంత్రుల మధ్య నెలకొన్న గ్యాప్ తో ఎక్కడ ఎవరికిచ్చిన ఇబ్బందులు తప్పవని బయట నుంచి తీసుకోని వచ్చి ఇక్కడ పోటీచేయించాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ..దీనిపై జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి…జిల్లా లో కాంగ్రెస్ నేతలు గొడ్డుబోయరా ..? ఇక్కడ నేతలు సరిపోరా ..?ఇదెక్కడి న్యాయమంటూ గగ్గోలు పెడుతున్నారు …అసలు ఇలాంటి దుష్ట సంప్రదాయం కొనసాగటం కరెక్ట్ కాదని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు …ఇప్పటికే జిల్లాలో అనేక మందిని దిగుమతి నేతలను పోటీకి పెట్టి జిల్లా నేతల ఆత్మాభిమానాన్ని ,గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు …ఒక వేల మంత్రుల కుటుంబసభ్యులను పెట్టడం ఇబ్బంది అయితే జిల్లాలో చాలామంది పోటీకి అర్హలు ఉన్నారు .. పార్టీకి కమిట్మెంట్ తో పనిచేసిన వారు పార్టీని కష్టకాలంలో ఆదుకున్నవారు లేకపోలేదు … అర్థ ,అంగబలంతో అన్ని రకాలుగా సిద్దమైన వారు , విద్యావంతులు ఆలోచనాపరులు , సామాజికవర్గాల వారు ఉండగా బయట వారిని తెచ్చి బలవంతంగా జిల్లా ప్రజల నెత్తిన రుద్దడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో అధిష్టానం పెద్దలు ,జిల్లా మంత్రులు ఆలోచించుకోవాలనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి… అభ్యర్థి ఎంపిక లో అధిష్టానం నాన్చుడు ధోరణి పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరికలు ఉన్నాయి…అయినా పార్టీ తీరు మారడంలేదని సామాన్యులు సైతం వాపోతున్నారు …

మొదటి నుంచి మంత్రుల కుటుంబసభ్యులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు … డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని పేరు బాగా వినిపించింది …ఆమె కూడా పోటీకి ఉత్సాహంగా ఉన్నారు …ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్న ఆమె మధిర నియోజకవర్గంలో ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు …ఆమెకు టికెట్ దాదాపు కన్ఫామ్ అయిందని ప్రచారం జరిగింది …ఆమె టికెట్ కోసం కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నప్పటినుంచి ఎక్కడ వెనక్కు తగ్గలేదు … ఈనెల 23 తేదీన నామినేషన్ వేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు … కాంగ్రెస్ బీ ఫారం తోనే నామినేషన్ వేస్తానని ఘంటాపథంగా చెపుతున్నారు ..భట్టి మాత్రం తన మనసులోని మాటను పార్టీ ఫోరమ్ లో తప్ప ఎక్కడ బయటపెట్టడంలేదు ….

సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం లోకసభ టికెట్ ఇప్పించుకోవాలని మంత్రి పొంగులేటి విశ్వ ప్రయత్నాలు చేశారు …అసెంబ్లీ ఎన్నికల్లో తన అన్న పోటీచేసిన పాలేరు నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు …మంత్రి మాత్రం ఆయన పేరు తప్ప మరొకరి పేరు చెప్పడంలేదని సమాచారం …అయితే పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది …ఆయన పోటీకి సుముఖంగా లేకపోయినా ఆయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి వరంగల్ ఎంపీగా రెండు సార్లు ఎన్నికైయ్యారు …మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం అని ఆయనకు ముఖ్యమంత్రి అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది …

మంత్రి తుమ్మల తనయుడు డాక్టర్ యుగంధర్ ఖమ్మం నుంచి పోటీకోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు …తండ్రి అనుమతితోనే ఆయన ముందుకు పోతున్నారా …లేక తన అభీష్టం మేరకే పోతున్నారా …? అనేది చర్చనీయాంశంగా ఉంది …రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరున్న తుమ్మల మనసు తెలుసు కోవడం కొంచం కష్టమే అంటున్నారు ఆయన్ను ఎరిగిన వారు …తాజాగా మండవ వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తుంది …మండవ పేరు తెరపైకి రావడంలో తుమ్మల ప్రమేయం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి…

మంత్రులతో ఇబ్బంది ఉందని అనుకున్న వారికీ పక్కన పెడితే పోట్ల నాగేశ్వరరావు , రాయల నాగేశ్వరరావులు కమ్మ సామజిక వర్గం నుంచి తాము పోటీకి సై అంటున్నారు … మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వని యెడల తమకు అవకాశం ఇవ్వాలని మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు…

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని ఒక్క భద్రాచలం అసెంబ్లీ సీటు మినహా మిగతా తొమ్మది నియోజకవర్గాల్లో కాంగ్రెస్, సిపిఐ లకు బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన ప్రజలు కాంగ్రెస్ వైఖరిపై విసుగు చెందుతున్నారు …ఒక్క ఖమ్మం సీటు ఎంపిక కాదు దీనిపై రాష్ట్ర రాజకీయాల భవిషత్ ఆధారపడి ఉంది …పొరపాటు జరిగిందో మూల్యం చెల్లించుకోక తప్పదు …!

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం జోరు …కాంగ్రెస్ 8 ,సిపిఐ 1 బీఆర్ యస్ 1

Ram Narayana

ఇంతకూ పొంగులేటి పోటీ శాసనసభాకా …? పార్లమెంట్ కా …??

Ram Narayana

ఖమ్మం వార్తలు…….

Drukpadam

Leave a Comment