Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం వార్తలు…….

విలేఖరి వెంకన్న కుటుంబానికి 5వేలు ఆర్థిక సహాయం అందజేసిన మేళ్లచెరువు

ఇటీవల ఖమ్మం నగరంలో అనారోగ్యంతో మృతి చెందిన ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ కాసం వెంకన్న కుటుంబానికి ప్రముఖ వ్యాపారి , కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఛైర్మన్ మేళచెర్వు వెంకటేశ్వరరావు ఆదివారం 5వేల ఆర్ధిక సహాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకన్న నిబద్దత గల జర్నలిస్టని పేర్కొన్నారు.. భవిష్యత్తులో వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామన్నారు.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు కే హెచ్ సుందర రావు ,గెల్లా రవి తదితరులు పాల్గొన్నారు

లయన్స్ క్లబ్ సహకారంతో వ్యాక్సినేషన్ సిబ్బందికి భోజనం పంపిణీ …


వైరా మున్సిపాలిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సూపర్ రైడర్స్ కు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది .ఆదివారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డ్ కౌన్సిలర్ లయన్స్ క్లబ్ జోన్ సభ్యురాలు మాది నేని సునిత ప్రసాద్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో వ్యాక్సినేషన్ అందిస్తున్న వైద్య సిబ్బందికి మున్సిపాలిటీ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి భోజనాలు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో లయన్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళి కృష్ణ ,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సీతారాములు, మున్సిపల్ కమిషనర్ వెంకటపతిరాజు, ఐదోu వార్డ్ కౌన్సిలర్ మాదినేని సునీత ,లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లగడపాటి ప్రభాకర్ , డాక్టర్ సుచరిత,వుండ్రు శ్యాం బాబు, శ్రీనివాస్ రావు,నీరజ, లక్ష్మి, అనుమోలు సైదులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

కట్టెకోలను వరించిన కవిశేఖర బిరుదు


నరసయ్య పూర్తి చేసిన నూరు షాడోల కవితలు
జూమ్ సభలో బిరుదు ప్రధానం
పలువురు ప్రముఖుల ప్రశంసలు

ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ కట్టెకోల చిన నరసయ్యను కవి శేఖర బిరుదు వరించింది. సాహిత్యంలో నూతన ప్రక్రియ షాడో ను జిల్లాకు చెందిన వేదిక సహాయ కార్యదర్శి దేవ యనగందుల రూపొందించారు. ఈమేరకు వాట్సాప్ గ్రూప్ ద్వారా షాడోల (క్రీనీడలు) కవితలను ఆహ్వానించారు. దాదాపు 20 మందికి పైగా కవులు వందకు పైగా కవితలను రాశారు నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామానికి చెందిన నరసయ్య వంద కవితలను పూర్తి చేసి వాట్సాప్ గ్రూప్ కు పంపించారు. ఆదివారం భువన విజయం తెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జూమ్ వేదిక నుండి వేదిక సహాయ కార్యదర్శి దేవ యనగందుల అధ్యక్షతన సాహిత్య సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సాహిత్యంలో షాడోల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం కవులకు జూమ్ సభ నుండి వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశంసా పత్రాలు బిరుదులు అందజేశారు. సమాజాన్ని ప్రతిబింబించే కవితలను కట్టెకోల చిన నరసయ్య ప్రజెంట్ చేయడాన్ని అభినందించారు. వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు వంకాయలపాటి చంద్రశేఖర్, అధ్యక్షులు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి పోతగాని సత్యనారాయణ టి పి టి ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రాజు, వికాస వేదిక అధ్యక్షులు లెనిన్ శ్రీనివాస్, పలు సాహిత్య వాట్సప్ గ్రూపుల నిర్వహకులు ప్రముఖ కవులు నెల్లుట్ల సునీత, ఆళ్ల వీరభద్రం, గుడిపూడి రాధికా రాణి, ఉమా మహేశ్వరి, గద్వాల సోమన్న, పాండురంగ విట్టల్, డా. ఆంజనేయులు తదితరులు ఈ సభలో మాట్లాడుతూ కట్టెకోలను అభినందించి ప్రశంసించారు.

Related posts

మన దగ్గర సహాయం పొందిన వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు …మాజీఎమ్మెల్యే కందాల

Ram Narayana

రఘురాంరెడ్డి విజయం కోసం కొడుకు , కోడళ్ళు ప్రచారం

Ram Narayana

తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంను ఎందుకు అభివృద్ధి చేయలేదు?: పువ్వాడ అజయ్

Ram Narayana

Leave a Comment