Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రఘు అక్రమ అరెస్టుపై… రాచకొండ సీపీ కి హెచ్ ఆర్ సి నోటీసులు…

రఘు అక్రమ అరెస్టుపై… రాచకొండ సీపీ కి హెచ్ ఆర్ సి నోటీసులు
టీయూడబ్ల్యూజే పిటిషన్ హెచ్.ఆర్.సి స్పందన….
రాచకొండ సీపీకి నోటీసు

జర్నలిస్టు గంజి రఘును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మానవ హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈ నెల 8న, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ చేసిన ఫిర్యాదుపై శుక్రవారం నాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ విషయమై రాచకొండ పోలీసు కమిషనర్ కు హెచ్.ఆర్.సి. ఇవ్వాళ నోటీసు జారీ చేసింది.

కొత్తగూడెంలో
జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేయాలి.
…….టీయూడబ్ల్యూజే ఐజేయూ.

జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టులకు నిరసనగా.
వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా మరియు నిరసన ప్రదర్శన చేశారు జర్నలిస్టులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ కొత్తగూడెం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. తొలుత ఫ్లకార్డులతో నిరసన తెలిపి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయిందని తెలంగాణ అమరవీరుల సాక్షిగా అమరవీరుల స్తూపానికి వినతి పత్రాలను ఇచ్చారు. అనంతరం టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలకోసం ఏర్పాటైనది. స్వతంత్ర తెలంగాణ రాష్ట్ర లక్ష్యం నీరుకార్చుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం జర్నలిస్టులపై చేస్తున్న దమనకాండను ఖండిస్తున్నామని అన్నారు. అక్రమంగా ముసుగులు వేసుకుని అంతర్జాతీయ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు అరెస్టు చేయడం సరికాదన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పే పోలీసులు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇటువంటి తప్పుడు పద్ధతిలో అరెస్టులు చేసి జర్నలిస్టులను భయభ్రాంతులను చేస్తే అందరూ తమ మాట వింటారని అనుకోవడం అవివేకమన్నారు .

కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి కష్టపడి పని చేసిన పోలీసులు తెచ్చుకున్న మంచి పేరు కాస్తా ఇటువంటి అనాలోచిత చర్యల వల్ల పోతుందని అన్నారు. ఇప్పటికన్నా జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టు పట్ల పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర హోం శాఖ మరియు కేంద్ర హోంశాఖ సరైన దిశగా ఆలోచనలు చేసి పోలీస్ శాఖ పై పడుతున్న మచ్చను తుడుచుకోవలసిందిగా జర్నలిస్ట్ నాయకులు డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ కేంద్ర కమిటీ సభ్యులు తూమాటి భద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుద్దుకూరు రామారావు, జిల్లా కార్యదర్శి జునమల రమేష్ , జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇమంది ఉదయ్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, వెంకట భాస్కర్ జిల్లా నాయకులు రెడ్డిమల్ల నవీన్,ఎర్ర ఈశ్వర్ , శివ కృష్ణ అస్లాం, సాక్షి శివ,సామ్సన్ రాజు, ఉదయ్ రాజ్, జంపన్న, రాము, నరసింహరావు, ఆవుల కోటేశ్వరరావు, గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

షాపూర్ నగర్ చౌరస్తాలో ధర్నా …..

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టును నిరసిస్తు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ చౌరస్తాలో జర్నలిస్టులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో నియంతృత్వ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం లో తమ బతుకులు మారుతాయని నాడు జర్నలిస్ట్లు ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక విలేకరుల సంక్షేమం మాటేమో గానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా రఘు అరెస్టుతో రిపోర్టర్ ల పట్ల ప్రభుత్వ వైఖరి తేటతెల్లం అయింది అన్నారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని జర్నలిస్టుల పట్ల కక్ష్యసాధింపులను మానుకోవాలని హితవు పలికారు. అక్రమంగా అరెస్టు చేసిన రఘును భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి సుధీర్ మంకల మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రవీందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి,. కృష్ణ రెడ్డి. లక్ష్మణ్, భాస్కర్ రెడ్డి. సంతోష్ రెడ్డి. అశోక్, కృష్ణ పంతులు, దత్తు, ప్రవీణ్, నవీన్. మూర్తి, మహేష్. సందీప్. ఉపేందర్. సంతోష్, వెంకటేష్. నవీన్.తదితరులు పాల్గొన్నారు

Related posts

పరమ శివుడు గరళం మింగినట్టుగా మోదీజీ ఆ బాధను దిగమింగారు.. షా

Drukpadam

విద్యుత్ కోతలపై ఏపీ ప్రభుత్వం ముందస్తు వార్నింగ్!

Drukpadam

షిండే సీఎం కాగానే శరద్ పవార్ కు షాక్!

Drukpadam

Leave a Comment