Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

డిప్యూటీ సీఎం భట్టితో టీయూడబ్ల్యూజే ఆధ్వరంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ హైలెట్స్ …

డిప్యూటీ సీఎం భట్టితో శుక్రవారం టీయూడబ్ల్యూజే ఆధ్వరంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో రాష్ట్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు , వాటి పరిష్కరానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి వివరించిన తీరు ఆయన ఆలోచన శక్తికి , రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహనకు అద్దం పట్టాయని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి…బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డి పాల్గొనగా ,ప్రముఖ పాత్రికేయులు దీలిప్ రెడ్డి మోడరేటర్ గా వ్యవహరించారు …రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో ఉన్న ప్రముఖ పాత్రికేయులు ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు …భట్టి పాత్రికేయుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు అబ్బురపరిచాయి….తాము రైతు బంధు కోసం 7 వేల కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంచి పోయామని బీఆర్ యస్ నేతలు చేస్తున్న ప్రచార డొల్లతనాన్ని ఆర్బీఐ రిపోర్ట్ ఆధారంగా ఎండగట్టిన తీరు పాల్గొన్న పాత్రికేయులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది …

తాము అధికారంలో ఉన్నపుడు విద్యుత్ సరఫరా ఒక్క సెకన్ కూడా కట్ కాలేదని ,ఇప్పుడు రాష్ట్రం అంధకారంగా మారబోతుందని బీఆర్ యస్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు …గతంలో కన్నా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ కోతలు లేని సరఫరా జరుగుతుందని ,ఎక్కడన్నా లైన్లలో లోపాలు ఉంటె రిపేర్లు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఇది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సహజంగా జరిగే ప్రక్రియ అని అన్నారు …కొందరు అధికారులు తమ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో చేయగా వారిపై చర్యలు తీసున్నట్లు వివరించారు …నిరంతరం విద్యుత్ సరఫరాపై తన ఇంటివద్ద , సచివాలయంలో తనతోపాటు అధికారులు నిరంతరం మోనిటరింగ్ చేస్తున్నారని ఎక్కడ విద్యుత్ కోతలు లేవని ప్రతిపక్షాల విమర్శలను కొట్టి పారేశారు …

కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమి చేసిందనేవారికి భట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు …. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను , నెలకొల్పిన పరిశ్రమలను, కేంద్ర సంస్థలను సోదాహరణంగా వివరించి సెహబాష్ భట్టి అనిపించుకున్నారు …

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని , నీళ్లు , నిధులు ,నియామకాల కోసం తెచ్చుకున్న రాష్ట్రాన్ని అదోగతి పాలుచేసిందని గణాంకాలతో సహా వివరించారు …రానున్న కాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్సు కవర్ చేయాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు …విద్య , వైద్యరంగాలపై ద్రుష్టి సారిస్తామని , ప్రవేట్ విద్యాలయాల్లో ఫీజులు నియంత్రణకు ఆలోచనలు చేస్తామని , ప్రభుత్వ రంగంలో విద్య ,వైద్య రంగాలను పటిష్టం చేస్తామని పేర్కొన్నారు … మీట్ ది ప్రెస్ లో వివిధ సమస్యలపై ఆయన వివరించిన తీరు రాజకీయనేతలా కాకుండా ఒక ఎకాడమిషన్ లా లోతైన అవగాహనతో సాగిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి..

అంతకు ముందు హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను సంఘం నేతలు విరహత్ అలీ , కిరణ్ , యూసుఫ్ బాబు , తదితరులు వివరించారు …తమ ప్రభుత్వం కచ్చితంగా అన్నిటిని అడ్రస్ చేస్తుందని జర్నలిస్టులకు అండగా ఉంటుందని భట్టి హామీ ఇచ్చారు … కార్యక్రమంలో ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి , ఐజేయూ కార్యవర్గ సభ్యులు కె .సత్యనారాయణ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు కె .రాంనారాయణ , హెచ్ యూ జె అధ్యక్ష కార్యదర్శులు సిగ శంకర్ గౌడ్ , షౌకత్ అహ్మద్ ,ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు …

Related posts

మొత్తానికి కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి.. కండువా కప్పిన ఖర్గే

Ram Narayana

రైతు రుణమాఫీ పట్ల కేసీఆర్ కు అభినందనల వెల్లువ …అసెంబ్లీ లో సీఎం ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఖమ్మం ఎమ్మెల్యేలు…

Ram Narayana

ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు…

Ram Narayana

Leave a Comment