Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతుల ఆస్తులు రూ.4,300 కోట్లకు పైగా!

  • భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • తన పేరిట రూ.1178.72 కోట్ల ఆస్తులు ప్రకటించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి
  • భార్య పేరిట రూ.3,203.90 కోట్ల ఆస్తులను అఫిడవిట్‌లో పేర్కొన్న విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తులను ప్రకటించారు. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరు మీద రూ.1178.72 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే తన భార్య సంగీతారెడ్డి పేరు మీద రూ.3,203.90 కోట్ల ఆస్తులను ప్రకటించారు. తన భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తదితరులు ఉన్నారు. 

కరీంనగర్ నుంచి రాజేందర్, వరంగల్ నుంచి కడియం కావ్య నామినేషన్

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులు ఉన్నారు. ఈరోజు పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు.

Related posts

అనుముల రేవంతరెడ్డి అను నేను ……తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా …

Ram Narayana

షర్మిల డిస్సప్పాయింట్మెంట్ …కాంగ్రెస్ తో పార్టీ విలీనం అనుమానమే …?

Ram Narayana

నేను పదేళ్లు సీఎంగా ఉన్నా… ఫోన్ ట్యాపింగ్‌పై కచ్చితంగా క్లారిటీ ఇస్తా: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment