ప్రధాని మోడీ బీసీలకు చేసిందేమిటి …కూరాకుల సన్మానసభలో ఎంపీ వద్దిరాజు
బీసీలంతా కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి
లోకసభలో బలమైన గొంతుక నామని గెలిపించుకోవాలి
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి ..
బీసీ వ్యక్తి మోడీ ప్రధానిగా ఉన్నప్పటికీ బీసీసీలకు ఒరిగిందేమి లేదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు ….మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం సన్మానసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు …ఈసందర్భంగా లోకసభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నామ నాగేశ్వరరావు ను గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు …ఆయన గత లోకసభలో పార్టీ పక్ష నాయకుడిగా ప్రజలపక్షాన బలమైన గొంతుకను వినిపించారని ఆలాంటి వ్యక్తి గెలిస్తే ప్రజల సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తారని అన్నారు …బీసీలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం దారుణమని అన్నారు …
బీఆర్ యస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ..ప్రధాని మోడీ తాను బీసీనని చెప్పుకుంటూనే బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వాపోయారు .. పదేళ్ల నుంచి అత్యున్నత పదవిలో ఉన్నా కూడా కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు
మహానేత కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని మోడీ పదేళ్లుగా తొక్కి పెట్టారని ధ్వజమెత్తారు … కులగణన చేపట్టాలని అన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నా మోడీ పట్టించుకోవడం లేదన్నారు .. కులగణన,బీసీ,మహిళా రిజర్వేషన్స్ అమలు జరగాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలన్నారు …నామ నాగేశ్వరరావు వంటి బలమైన నాయకుడు పార్లమెంటులో ఉంటేనే ప్రజల న్యాయమైన హక్కులకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు ..
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతునిద్దాం
నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు …
ఈ కార్యక్రమంలో “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జై యాదవ జైజై యాదవ”,”బీఆర్ఎస్ లోకసభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం”అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు
ఈ సందర్భంగా రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్రను పలువురు యాదవ ప్రముఖులు శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు