ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయానికి జోర్దార్ గా సమావేశాలు
రఘురాం రెడ్డి విజయానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని మంత్రులు పొంగులేటి,తుమ్మల
పాలేరు, ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పోటెత్తిన ప్రజాప్రతినిధులు
పాలేరు సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సంభాని, పీసీసీ పరిశీలకులు
ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శనివారం నగరంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో ఖమ్మం, టీ సీ వీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో పాలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశాల్లో మంత్రులు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని, ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని..లోక్ సభ ఎన్నికల్లో రఘు రాం రెడ్డిని ఇంతకు నాలుగు రెట్ల మెజారిటీతో పట్టం కట్టాలని, నేటి మా పదవులు ప్రజల చలువ అని అన్నారు. అధికార మధం, అహంకారం తో విర్రవీగిన బీఆర్ఎస్ పాలకులకు ఓటర్లు చెంప చెల్లుమనిపించారని, ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలగాంణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కోసమైనా రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు. మతోన్మాద బీ జే పీ సర్కారు ను గద్దె దించుదాం అని పిలుపునిచ్చారు. పాలేరు సమావేశానికి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ హాజరవగా.. లోక్ సభ అభ్యర్థి రఘురాం రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ విజయానికి ముమ్మర కృషి చేస్తానని సంభానీ ప్రకటించారు.జిల్లాలో జోర్దార్ గా కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రజాప్రతినిధులు, భూతు లెవల్ కార్యకర్తలతో విస్తృత సమావేశాలు …
కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మధ్ జావేద్, కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షులు కళ్లెం వెంకట రెడ్డిల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో…. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువాళ్ళ దుర్గాప్రసాద్, పీ సీ సీ నుంచి పాలేరు నియోజకవర్గ పరిశీలకులు అశోక్ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, సీనియర్ నాయకులు మధ్ధినేని స్వర్ణ ణకుమారి, మద్ది శ్రీనివాస రెడ్డి, రామ సహాయం నరేష్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నల్లమల వెంకటేశ్వర రావు, జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, ఎం పీ పీ వజ్జా రమ్య, మంగీలాల్, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, సీ పీ ఐ నాయకులు దండి సురేష్, మహ్మద్ మౌలానా, సలాం, జానీ మియా, సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్, విక్రమ్, జబ్బార్, నవీన్ రెడ్డి, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.