పార్టీ విజయం కోసం కష్టపడిన ఏ కార్యకర్తని బిఆర్ఎస్ పార్టీ మర్చిపోదు..నామ ,వద్దిరాజు
ఎన్నికల ప్రచారంలో బూత్ లెవల్ కమిటీ సభ్యులులదే కీలక పాత్ర
ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటర్ ను కదిలించాలి
సర్వేలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారికే మద్దతు తెలుపుతున్న ఖమ్మం జిల్లా ప్రజలు..
అమలు కాని హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసింది..
తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు..
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో తెచ్చిన కరువు పై పోరాడుతాం..
పార్టీ విజయం కోసం కష్టపడిన ఏ కార్యకర్తను బీఆర్ యస్ మర్చిపోదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , బీఆర్ యస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు …గురువారం
ఖమ్మం కార్పొరేషన్ టూ టౌన్ బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ సభ్యుల సమావేశం ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన జరిగింది ..ఈ సమావేశంలో అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బూత్ కమిటీ సభ్యులకు డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ విషయాలను దిశా నిర్దేశం చేశారు. బూతు కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ ను కదిలించాలన్నారు…అలవి కానీ వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బయటపెట్టాలని తెలిపారు …కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందని , కరెంటు సమస్యలు వస్తున్నాయని ,ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని ఆరోపించారు …కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు …
ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, టూ టౌన్ కార్పొరేటర్ లు శ్రీవిద్య పగడాల, శీలంశెట్టి వీరభద్రం, దోరేపల్లి శ్వేత, మోతారపు సుధాకర్, ఉద్యమకారులు సుబ్బారావు, పొన్నం వెంకటేశ్వర్లు, బుర్రి వినయ్, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, బూతులు కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: