Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఇండిపెండెంట్లకు జనసేన గుర్తు కేటాయింపు.. ఏపీ హైకోర్టులో పిటిషన్‌

  • జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
  • ఈసీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన జనసేన
  • అనుబంధ పిటిషన్ వేసిన టీడీపీ

ఏపీలో జనసేన పోటీ చేయని స్థానాల్లో ఆ పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు ఎన్నికల అధికారులు కేటాయిస్తున్నారు. దీనిపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఈసీ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది. గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్ లో జనసేన కోరింది. జనసేన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఇదే అంశంలో తమ వాదనలు వినిపించేందుకు టీడీపీ కూడా అనుబంధ పిటిషన్ వేసింది. 

జనసేన పోటీ చేయని స్థానాల్లో కూటమి తరపున టీడీపీ లేదా బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయిస్తే… జనసేన మద్దతుదారులు తికమకపడే అవకాశం ఉంది. గ్లాసును జనసేన గుర్తుగా భావించి ఇండిపెండెంట్ అభ్యర్థికి పొరపాటున ఓటు వేసే పరిస్థితి ఉంది. అదే జరిగితే కూటమికి నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో, జనసేన హైకోర్టును ఆశ్రయించింది.

Related posts

రూ. 700 కోట్ల విలువైన 1425 కేజీల బంగారం స్వాధీనం.. ఎన్నికల వేళ తమిళనాడులో కలకలం…

Ram Narayana

 ‘వికసిత భారత్’ వాట్సాప్ సందేశాలకు బ్రేకులు వేసిన ఎన్నికల సంఘం

Ram Narayana

ఏపీలో బదిలీ చేసిన ఇద్దరు ఐపీఎస్ ల స్థానంలో నూతన నియామకాలు…

Ram Narayana

Leave a Comment