Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం జిల్లా వార్తలు …..

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ప్రముఖులు
మొక్కలు నాటిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ పార్కు నందు మొక్కలు నాటారు. అనంతరం పార్కు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో లో వన్య ప్రాణుల సంరక్షణ కొరకు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ..
ప్రతి సంవత్సరం కూడా ఒక్కో ధిమ్ ను ఎంపిక చేసి పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారని 1974 వ సంవత్సరం లో తొలిసారి “ఒకే ఒక్క భూమి” అనే థీమ్తో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఈ సంవత్సరం “పునరాలోచన, పునః సృష్టి ,పునరుద్ధరణ” అని తిమ్ తో పర్యావరణాన్ని దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతతో ఒక మొక్కను నాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మొక్కలు నాటిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, సీఈఓ ప్రియాంక గారు, వైరా జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ గారు.

సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,నగర మేయర్ పునుకోల్లు నీరజ


ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరావు గారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం సుడా చైర్మన్,నగర మేయర్ హాజరై మొక్కలు నాటారు.అనంతరం ముఖ్య అతిథులకు శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కమర్తపు మురళి,మాజీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, కార్పొరేటర్లు సరిపుడి రమాదేవి సతీష్,దోరేపల్లి శ్వేత,RTI డైరెక్టర్ వల్లభనేని రామారావు, మున్సిపల్ అధికారులు,మరియు12వ డివిజన్ ముఖ్యనాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు డయాగ్నొస్టిక్ కేంద్రాలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
సీఎం కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా జిల్లాల్లో 19 డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు ఈ నేపథ్యంలో ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న సీఎం కేసిఆర్ కు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు .

 

ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి…..సిపిఎం

 

 

ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి వ్యవసాయకార్మికసంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీల డిమాండ్. ఖమ్మం జూన్ 5 తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఉపాధి పని సంవత్సరంలో 200 రోజులకు పెంచాలని రోజు కూలీ 600 రూపాయలు కేరళ తరహాలో ఇవ్వాలని ఉపాధి పని ప్రదేశాల్లో కరోనా టెస్టులు చేసి కరోనా నివారణ వ్యాక్సిన్ ఇంజక్షన్ పేదల అందరికీ ఉచితంగా ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ కి డి ఆర్ డి ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఇ పొన్నం వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ జిల్లాలో కరోనా వల్ల పనులు మందకొడిగా జరుగుతున్నాయని ప్రజలు కరుణ వ్యాధి వల్ల భయభ్రాంతులకు గురి అవుతున్నారని వారికి వ్యాక్సిన్ ఇచ్చి కాపాడాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు తక్షణం వ్యవసాయ కార్మికులకు ఉచిత వ్యాక్సిన్ అందించాలని పని ప్రదేశాల్లోనే కరోనా టెస్టులు కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు కరోనా ఉన్నంతవరకు ప్రతి నెలా ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు 50 కేజీల బియ్యం ఇవ్వాలని కేరళ తరహాలో 17 రకాల నిత్యావసర వస్తువులు అందజేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు దళిత గిరిజన నూలు ఉపాధి పని చేసిన గ్రామాలలో మూడు వారాల నుంచి 11 వారాల వరకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ ఉపాధ్యక్షులు పొన్నెకంటి సంగయ్య కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ పాల్గొన్నారు

 

ఉచిత బియ్యం పంపిణి ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

 

లాక్ డౌన్ లో నిరుపేదలకు చేయుతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలుపరిచిన లాక్ డౌన్ నేపథ్యంలో పలు వృత్తులు, వ్యాపారాలు, పనులు చేసుకునే వారు జీవన ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి చేయూతగా చేపట్టిన రాష్ట్రం లోని ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి 15 కేజీలు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి 25 కేజీల బియ్యం, రెండు వేల రూపాయలు నగదును చేయూత ఇచ్చి అదుకున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు తెలిపారు. నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రజలతో మమేకమై పనిచేస్తున్న పలు వ్యక్తులను సూపర్ స్పైడర్ గా గుర్తించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టి నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఆర్ టీ సి, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ , గ్యాస్ డీలర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేశామని, త్వరలోనే చిరు వ్యాపారస్తులకు, షాపులో పనిచేస్తున్న వ్యక్తులకు, బార్బర్ షాప్ లలో పని చేస్తున్న వారికి, ఆటో, లారీ డ్రైవర్ లను గుర్తించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, సలహాలు, సూచనలు ప్రజలంతా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. లాక్​డౌన్ వెసులుబాటు సమయంలో అత్యవసరమైన పని ఉన్న వారు మాత్రమే బయటకు రావాలని ఆయన తెలిపారు. అవసరం లేని వారు బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

ఖమ్మంలో సూపర్ స్ప్రెడర్స్ కి కరోనా వ్యాక్సిన్

ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ స్పైడర్ అనగా చిరువ్యాపారులు తోపుడు బండ్లు,నాయిబ్రాహ్మణులు,వైన్ షాప్స్ లో పనిచేసే వర్కర్లు,చికెన్, మటన్,షాపు,యజమానులు వర్కర్లు,వ్యాపారస్తులుకు కోవిడ్ వ్యాక్సిన్ కొరకు వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈరోజు ఖమ్మం నగరంలోని పి.జీ కాలేజీలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించిన నగర మేయర్ పునుకోల్లు నీరజ, కమిషనర్ అనురాగ్ జయంతి,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కమర్తపు మురళి,కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ,సరిపుడి రమాదేవి సతీష్,మరియు వైద్య,మున్సిపల్,మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

 

జర్నలిస్ట్ రఘు అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికం.


ఖమ్మం జూన్ 5. జర్నలిస్టు రఘు అరెస్టు అక్రమం, అప్రజాస్వామికమని శనివారం లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ ఒక ప్రకటనలో విమర్శించారు. కోకాపేట కాందిశీకుల భూమి వంటి అనేక భూ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి న్నందుకు, వందల వేల కోట్ల రూపాయల కుట్రను బయట పెట్టినందుకు అభినందించాల్సిన సందర్భంలో
తెలంగాణ ప్రభుత్వం రఘు ను అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేసిందని ఆరోపించారు.
తన నివాస సమీప ప్రాంతంలో ఉదయం 9 గంటలకు నెంబర్ ప్లేట్ లేని జీపులో
తలపై ముసుగు వేసి ,చేతులు వెనక్కు కట్టేసి ,
కిడ్నాప్ చేసిన వ్యక్తిని తీసుకుపోయిన రీతిలో అరెస్ట్ చేయడం అక్రమం ,అన్యాయం తోపాటు అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.. పైగా ,ముసుగు వేసి ,చేతులు కట్టి, బలవంతంగా జీవులోఎక్కించుకు పోయే సందర్భంలో సంబంధిత వ్యక్తులు ,ఈ కుంభకోణాలపై వరుస కథనాలను ప్రసారం చేస్తే ఖబడ్దార్ అని… కేకలు వేయడం గమనార్హమైన విషయం అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయ వ్యవస్థ నాలుగవ స్థంభం గా భావించి కుంటున్న ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థ పై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థ పై దాడి గానే చూడాల్సి ఉంటుందన్నారు.

మెడికల్ క్యాంపు విజయవంతం…

CPM పార్టీ టూ టౌన్ కమిటీ, బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెడికల్ క్యాంపు విజయవంతంగా జరిగింది అని CPM టూ టౌన్ సెక్రటరీ వై విక్రమ్ తెలిపారు.
మెడికల్ క్యాంపు లో మందులు పంపిణీ కార్యక్రమాన్ని cpm జిల్లా కమిటీ సభ్యులు వై విక్రమ్ మందులు ఇచ్చి ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
షుగర్, బిపి చెక్ చేసి నెలకు సరిపడా మందులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు సి భారవి, ch సుబ్బారావు రోగాలను పరిక్షించి మందులు ఇచ్చి తెలిపారు. తిరిగి వచ్చే నెల మెదటి శనివారం మెడికల్ క్యాంపు వుంటుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో నాయకులు వై శ్రీనివాసరావు, ఝాన్సీ, అఫ్జల్, నర్రా రమేష్, భద్రం, వెంకన్న, వాసు,
రామారావు తదితరులు పాల్గొన్నారు

పనిభారం పై ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల ఆందోళన ….

ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నర్సుల కొరత తో ఉన్న వారికి పని భారం పెరగడంతో పాటు సెలవులు ఇవ్వకుండా డ్యూటీ లు వేయడంతో నర్సులు ఆందోళనకు దిగారు. గత వారం ఆందోళన చేసిన నర్సులు రెండు రోజుల్లోనే సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన అదికారులు పట్టించుకోక పోవడం తో నర్సులు మరల ఆందోళనకు దిగి హాస్పిటల్ గేటు ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఆర్ ఎం ఓ బి.శ్రీనివాస రావు, డి ఎం హెచ్ ఓ మాలతి నర్సుల తో చర్చలు జరిపి 34 మంది నర్సుల ను కొత్త వాటిని తీసుకుంటామని వాళ్ళు వచ్చిన తరువాత సెలవులు ఇస్తామని ఒక మూడు రోజులు ఓపికగా ఉండాలని కోరారు. డి ఎం హెచ్ ఓ మాలతి ఇచ్చిన హామీ తో నర్సులు ఆందోళన విరమించారు

 

Related posts

డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Ram Narayana

సెహబాష్ కలెక్టర్ గౌతమ్ గారు … పిల్లల చదువుల పట్ల చూపుతున్న శ్రద్ధకు హ్యాట్సప్ …

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ….

Drukpadam

Leave a Comment