- రాయ్‌బరేలి మెజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు సమయంలో రాహుల్ గాంధీ వెంట సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా
- అమేథి నుంచి వీడి రాయ్‌బరేలికి మారిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకగాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయ్‌బరేలి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాల నుంచి నెహ్రూ కుటుంబం దశాబ్దాలుగా ప్రాతినిథ్యం వహిస్తోంది. 2004 నుంచి అమేథి నుంచి సోనియా గాంధీ, రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీ గెలుస్తూ వస్తున్నారు. 2019లో మాత్రం బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీ ఈసారి తల్లి ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తున్నారు. అమేథి నుంచి కాంగ్రెస్ పార్టీ కిషోర్ లాల్ శర్మను బరిలోకి దింపింది.