Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల నీ నిర్ణయం సమర్ధనీయం కాదు: తమ్మినేని…..

ఈటల నీ నిర్ణయం సమర్ధనీయం కాదు: తమ్మినేని
-బిజెపిలో చేరాలన్న నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యం
-ఫాసిస్టు పార్టీ బీజేపీ పంచన చేరడం సిగ్గుచేటు
-పైగా దాన్ని సమర్ధించుకోవడం దారుణం

మాజీ మంత్రి, టిఆర్‌ఎస్‌ నాయకుడు ఈటెల రాజేందర్‌ త్వరలో బిజెపిలో చేరడానికి నిర్ణయించుకోవడం దురదృష్టకరంమని సిపిఎం విమర్శించింది .నీ నిర్ణయం ఎట్టిపరిస్థితుల్లో సమర్థనీయం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం అన్నారు. తాను చేస్తున్న అప్రతిష్టాకరమైన పనిని కప్పిపెట్టుకోవడానికి కమ్యూనిస్టులపై కువిమర్శలు చేయడం అభ్యంతరకరం అన్నారు.
వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి ఇప్పుడు ఏకంగా మతోన్మాద ఫాసిస్టు బిజెపి పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయం మన్నారు. ఈరోజు కేంద్రంలో బిజెపి ప్రజాకంటక పాలన సాగిస్తున్నవిషయాన్నీ గుర్తు చేశారు. లౌకిక విలువలను గంగలో కలిపి మతోన్మాద రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. . కార్మికులు, రైతులు, బలహీనవర్గాల హక్కులపై దాడి చేస్తున్నదన్నారు . ఫెడరిలిజాన్ని ధ్వంసం చేసి రాష్ట్రాలను భిక్షమెత్తుకోవాల్సిన దుస్థితికి తెస్తున్నదన్నారు . ప్రజాస్వామిక హక్కులను కాలరాసి నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. తన రాజకీయ భవిష్యత్తు కోసం బిజెపి లాంటి ప్రమాదకర పార్టీని ఎంచుకోవటం శోచనీయం. ఇప్పటికైనా ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే తెలంగాణ ప్రజల లౌకిక వారసత్వాన్ని గౌరవించినవారవుతారు తమ్మినేని హితవు పలికారు.

 

 

Related posts

శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం 2 వేల కోట్ల ఒప్పందమా …?

Drukpadam

వైసీపీలో చేరుతున్న క్రికెటర్ అంబటి రాయుడు?

Drukpadam

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు …ఎర్రజెండాలు వైఖరి !

Drukpadam

Leave a Comment